Supreme Court : హైదరాబాద్ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. పనిగట్టుకుని ఆగమేఘాల మీద గవర్నర్ కోటా కింద నియమించిన ప్రొఫెసర్ కోదండరాంరెడ్డి , ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ల ఎమ్మెల్సీ పదవులు రద్దు చేస్తున్నట్లు తీర్పు చెప్పింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని పేర్కొంది. ఓ వైపు సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించినా ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రశ్నించింది. సిఫారసు చేసిన సీఎంను, ఆమోదించిన గవర్నర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Supreme Court Rejects
బుధవారం వెలువరించిన ఈ తీర్పు రాజకీయ వర్గాలలో కలకలం రేపింది. గవర్నర్ కోటా కింద శాసన మండలి సభ్యులుగా నియమితులైన కోదండరాం రెడ్డి, అమీర్ అలీ ఖాన్ నియామకాలు చెల్లవని , ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొంది. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా తెలంగాణ శాసన సభ ఎన్నికలకు ముందు మాజీ సీఎం కేసీఆర్ గవర్నర్ కోటా కింద డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, కర్రె సత్యనారాయణలను ప్రతిపాదించారు. అప్పటి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు పంపారు. దానిని ఆమె తిరస్కరించింది. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది.
దీంతో తన సామాజిక వర్గానికి చెందిన కోదండ రాం రెడ్డితో పాటు అలీ ఖాన్ లను ఆగమేఘాల మీద గవర్నర్ కోటా కింద ప్రతిపాదించారు. తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. అయినా మరోసారి గవర్నర్ కోటా సిఫారసు చేశారు. దానిని గవర్నర్ ఆమోదించడం, ఆ తర్వాత ఈ ఇద్దరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వీరి నియామకం రాజ్యాంగ విరుద్దమంటూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. చివరకు వారి నియామకం చెల్లదని తీర్పు చెప్పింది.
Also Read : Tejashwi Yadav Fired on Bihar Voter list : బీహార్ ఓటర్ల జాబితాపై తేజస్వి యాదవ్ ఫైర్

















