Supreme Court : ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ కు ఝలక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. గురువారం సంచలన తీర్పు వెలువరించింది. బీసీలకు ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ వర్తింప చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ధర్మాసనం గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. బీసీ కోటా పెంపుపై తెలంగాణ రాష్ట్రం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కోట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఇచ్చిన మాదిరిగానే 50 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లోకి వెళతుందో వేచి చూడాలి.
Supreme Court Rejected
మరో వైపు బీసీలకు న్యాయ పరంగా దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కకుండా చేస్తున్నారంటూ బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈనెల 18వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహించాలని కోరారు. ఈ బంద్ కు భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్. ఇంకో వైపు బీసీ మేధావులు, న్యాయవాదులు, ఇతర వర్గాలకు చెందిన వారంతా ముక్త కంఠంతో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేంత వరకు ఎన్నికలు నిర్వహించ వద్దని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ నాటకం ఆడుతోందని ఆరోపించారు బీసీ నేతలు.
Also Read : TG High Court Approved : భమృక్నుద్దౌలా చెరువుకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్

















