Super GST Super Savings : అమరావతి : ఈనెల 16వ తేదీన కర్నూలులో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే సూపర్ జిఎస్ టి సూపర్ సేవింగ్స్ (Super GST Super Savings) సభను విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులంతా సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ కోరారు. ప్రధాని రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై ఉండవల్లి నివాసంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశానికి రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ముఖ్యమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, పీయూష్ కుమార్, అహమ్మద్ బాబు హాజరయ్యారు. ఈనెల 16వతేదీ ఉదయం ప్రధాని మోడీ సున్నిపెంట వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారని తెలిపారు.
Super GST Super Savings Meeting
అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం బయలుదేరి వెళతారు. అనంతరం శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారని చెప్పారు నారా లోకేష్. తర్వాత శ్రీశైలం నుంచి బయలుదేరి కర్నూలు సమీపంలోని నన్నూరు రంగమయూరి గ్రీన్ హిల్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సూపర్ జిఎస్ టి –సూపర్ సేవింగ్స్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో ప్రధాని మోడీతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు తాను కూడా ప్రసంగిస్తానని చెప్పారు నారా లోకేష్. సభానంతరం ప్రధాని మోడీ సాయంత్రం కర్నూలు సమీపాన గల ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకుని డిల్లీ బయలు దేరి వెళ్తారని పేర్కొన్నారు.
Also Read : Manda Krishna Madiga Strong Response : సీజేఐపై దాడి అనాగరికమైన చర్య : మందకృష్ణ
















