Popular Director Sukumar : ప‌దేళ్లు పూర్తి చేసుకున్న సుకుమార్ రైటింగ్స్

రామ్ చ‌ర‌ణ్ కోసం క‌థ సిద్దం చేస్తున్న ద‌ర్శ‌కుడు

Hello Telugu - Popular Director Sukumar

Hello Telugu - Popular Director Sukumar

Sukumar : హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ద‌మ్మున్న డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందారు సుకుమార్. సుకుమార్ రైటింగ్స్ స్టార్ట్ చేసి 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. త‌ను తొలినాళ్ల‌లో బ‌న్నీతో తీసిన ఆర్య సూప‌ర్ హిట్. ఆ త‌ర్వాత మ‌హేష్ , రామ్ చ‌ర‌ణ్ తో తీశాడు. గ‌త కొన్నేళ్లుగా త‌ను దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాడు. అల్లు అర్జున్ , ర‌ష్మిక మంద‌న్నాతో క‌లిసి తీసిన చిత్రం పుష్ప -1, పుష్ప -2 దుమ్ము రేపాయి. కాసుల వ‌ర్షం కురిపించాయి. ఏకంగా పుష్ప -2 దేశంలోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. 1768 కోట్లు వ‌సూలు చేసింది. ఇటీవ‌లే దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గిన సైమా అవార్డుల కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సుకుమార్ (Sukumar) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. అదేమిటంటే పుష్ప గురించి కీల‌క అప్ డేట్ ఇచ్చాడు. పుష్ప మూవీకి సంబంధించి సీక్వెల్ ఉంటుంద‌ని వెల్ల‌డించాడు. దీంతో బ‌న్నీ స‌ర‌స‌న నేష‌న‌ల్ క్ర‌ష్ న‌టిస్తుందా లేక ఇంకెవరినైనా తీసుకుంటాడా అన్న‌ది ఇంకా తేలాల్సి ఉంది.

Director Sukumar 10 Years Completed

ప్ర‌స్తుతం బ‌న్నీ బిజీగా ఉన్నాడు. త‌ను హాలీవుడ్ రేంజ్ లో తీయ‌బోయే అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. దీనిని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. ఈ ఒక్క మూవీ కోస‌మే అల్లు అర్జున్ ఏకంగా రూ. 150 కోట్లు రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఇది పక్క‌న పెడితే సుకుమార్ ఈ గ్యాప్ లో రామ్ చ‌ర‌ణ్ తో మూవీ తీయాల‌ని, అందు కోసం క‌థ కూడా సిద్దం చేసే ప‌నిలో ఉన్న‌ట్టు ఇండ‌స్ట్రీలో టాక్. ఇదిలా ఉండ‌గా చెర్రీ ప్ర‌స్తుతం సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వంలో పెద్ది మూవీలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. ఏది ఏమైనా సుకుమారా మ‌జాకా అంటున్నారు ఫ్యాన్స్.

Also Read : Kazakhstan Ambassador Important Meet : తెలంగాణాలో వాణిజ్య ఒప్పందాలపై గవర్నర్ ను కలిసిన అజామాత్

Exit mobile version