TTD : తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి కీలక ప్రకటన చేసింది. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అవాస్తవాలను ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. తిరుమలలో తక్కువ ధరకే ఆహార పదార్థాలు లభిస్తున్నాయని, రూముల బుకింగ్ కు సంబంధించి స్కామ్స్ జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడం పట్ల స్పందించింది టీటీడీ. ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది. ప్రతి పోస్ట్ ను తమ టీం పరిశీలిస్తుందని పేర్కొంది. ఆధారాలు లేకుండా ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడం చట్ట రీత్యా నేరం కిందకు వస్తుందని తెలుసుకుంటే మంచిదని హితవు పలికింది.
TTD Strong Warning
తమ విచారణలో అవన్నీ నకిలీవని తేలిందని స్పష్టం చేసింది. రెండు ఇడ్లీలు రూ. 7.50, రెండు చపాతీలు రూ. 20, టీ రూ. 5, పూర్తి భోజనం రూ. 31కే పెడుతున్నారంటూ పోస్ట్ షేర్ చేశారు. నకిలీ వార్తలను వ్యాప్తి చేసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆలయ ట్రస్ట్ ప్రకటించింది. దర్శనం లేదా వసతి కోసం మధ్యవర్తుల బారిన పడవద్దని భక్తులకు సూచించింది.
శ్రీవారి అభిషేకం, అర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనం , రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టిక్కెట్ల లభ్యతను తప్పుగా ప్రచారం చేస్తూ వైష్ణవ యాత్రలు అనే ఫేస్‌బుక్ పేజీని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దింటి ప్రభాకరాచార్యులు అనే వ్యక్తి గురించి ట్రస్ట్ భక్తులను హెచ్చరించింది. అటువంటి వ్యక్తులను లేదా వెబ్‌సైట్‌లను నమ్మవద్దని కోరింది. అధికారిక టిటిడి వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని భక్తులను తీవ్రంగా హెచ్చరించింది.
Also Read : TTD Strong Action : భక్తుల సేవలకు ఆటంకం కల్గిస్తే చర్యలు – టీటీడీ
















