XI Jinping : భారత దేశంతో సుదీర్ఘమైన బంధాన్ని చైనా కోరుకుంటోందని స్పష్టం చేశారు చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్. ఆదివారం ప్రధాని మోదీ చైనాలో పర్యటించారు. ఆయన రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ సందర్బంగా ఇరు దేశాధినేతల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిపారు. భారతదేశం, చైనా దీర్ఘకాలిక దృక్కోణం నుండి సంబంధాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇద్దరు నాయకుల మధ్య చర్చలు షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జరిగాయి. చైనాలోని టియాంజిన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
XI Jinping Key Comments
ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు కంటి మీద కునుకు లేకుండా చేసింది మోదీ, జిన్ పింగ్ (XI Jinping) లు. మా ద్వైపాక్షిక సంబంధాల స్థిరమైన, దృఢమైన, స్థిరమైన అభివృద్ధిని గ్రహించడానికి రెండు వైపులా వ్యూహాత్మక ఎత్తులు, దీర్ఘకాలిక దృక్పథం నుండి మా సంబంధాన్ని సంప్రదించి నిర్వహించాలి అని ఆయన అన్నారు. భారతదేశం, చైనాలు బహుళ ధ్రువ ప్రపంచం , అంతర్జాతీయ సంబంధాలలో మరింత ప్రజాస్వామ్యం కోసం కూడా కృషి చేయాలని జిన్‌పింగ్ కోరారు. అంతే కాకుండా ఆసియా తో పాటు ప్రపంచ వ్యాప్తంగా శాంతి, శ్రేయస్సుకు మన వంతు కృషి చేయడానికి మన చారిత్రక బాధ్యతను కూడా మనం పెంచుకోవాలని స్పష్టం చేశారు.
Also Read : Trump Health Condition Critical : ట్రంప్ కు అనారోగ్యం పుకార్లు షికార్లు..?
















