న్యూఢిల్లీ : దయచేసి అమాయకులైన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్ చుక్. నీట్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన వారిపై విచక్షణారహితంగా పోలీసులు దాడులకు దిగారు. ప్రతిపక్ష నేతలను సైతం ఈడ్చుకుంటూ వెళ్లారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్య దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. దాడులు చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. దీనిపై తీవ్రంగా స్పందించారు సోనం వాంగ్ చుక్. విద్యార్తులపై దాడులు ఆపాలని, తాను తక్షణమే దీక్ష విరమిస్తానంటూ ప్రకటించారు . ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, సింగ్ లకు లేఖ రాశారు.
తన ఇతర రెండు కీలక డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హామీ ఇచ్చారని ఆయన అన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, ఆయన భార్య గీతాంజలి జె. ఆంగ్మో పాల్గొన్నారు. 20 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్, లడఖ్‌కు రాజ్యాంగ రక్షణలు, మరింత భద్రత కల్పించాలన్న తన డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. పరీక్షలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ చేపట్టిన నిరసనలో పాల్గొన్న విద్యార్థులు, యువతపై ఎలాంటి శిక్షాత్మక లేదా ప్రతీకార చర్యలు తీసుకోబోమని కేంద్రం స్పష్టమైన హామీ ఇస్తే, తాను చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తానని కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటించారు.

















