Stock Market : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 50 ఆమదు సుంకాల విధానం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఈ నిర్ణయం అనంతరం అంతర్జాతీయంగా మార్కెట్లు (Stock Market) మిశ్రమ సంకేతాలను చూపుతుండగా, భారతీయ స్టాక్ సూచీలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది.
Stock Market Sensational
గురువారం ఉదయం దేశీయ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ముగింపుతో (80,543) పోలిస్తే సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్ల నష్టంతో ప్రారంభమై, అనంతరం కొంత స్థిరత సాధించింది. అయితే పలు రంగాల్లో అమ్మకాలు పెరగడంతో సూచీలు నెగటివ్ ట్రెండ్‌లోనే కొనసాగుతున్నాయి.
ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 279 పాయింట్ల నష్టంతో 80,264 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో నిఫ్టీ 78 పాయింట్ల నష్టంతో 24,495 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా బ్యాంకింగ్, మెట్‌ల్, ఆటో రంగాల్లో అమ్మకాలు కనిపించాయి.
మరోవైపు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు సంబంధించి సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని వచ్చిన వార్తలు పెట్టుబడిదారుల్లో కొంతమేర సానుకూలతను కలిగిస్తున్నాయి. అయితే ఆ ప్రభావం మార్కెట్లపై తక్కువగానే కనిపిస్తోంది.
స్టాక్‌ల పరంగా పరిశీలిస్తే, ఫోర్టిస్ హెల్త్‌కేర్, లూపిన్, పిరామిల్ ఫార్మా, గ్రాన్యుల్స్ ఇండియా, కోఫోర్జ్ లిమిటెడ్ వంటి షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక భెల్, జిందాల్ స్టెయిన్‌లెస్, కంటైనర్ కార్పొరేషన్, భారత్ ఫోర్జ్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.
నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 111 పాయింట్ల నష్టాన్ని నమోదు చేయగా, బ్యాంక్ నిఫ్టీ 184 పాయింట్ల వెనకడుగు వేసింది. విదేశీ మారక ద్రవ్యాలకు సంబంధించిన వివరాల్లో, రూపాయి ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే 87.71 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read : Today Gold Price : రోజురోజుకి సాధారణ మానవుడికి అందనంత స్థాయికి పసిడి ధరలు


















