Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల హడావిడి మొదలైంది. అక్టోబర్ 6 నుంచి ప్రారంభమయ్యే వారంలో ఇన్వెస్టర్లకు పెట్టుబడుల పరంగా పలు కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం ఐదు కొత్త పబ్లిక్ ఇష్యూలు (IPOs) ఈ వారం ప్రారంభంకానుండగా, ఇప్పటికే నాలుగు ఇష్యూలు మార్కెట్లో (Stock Market) కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బిజీగా మారారు.
Stock Market New IPO’s Update
అక్టోబర్ 6న ప్రారంభమయ్యే టాటా క్యాపిటల్ IPO ఈ వారం ప్రధాన ఆకర్షణగా మారింది. రూ.15,511.87 కోట్ల విలువైన ఈ పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 8 వరకు కొనసాగుతుంది. ఒక్కో షేరుకు రూ.310 నుండి రూ.326 వరకు ధర పరిధి నిర్ణయించగా, లాట్ సైజు 46 షేర్లుగా ఉంది. కంపెనీ షేర్లు అక్టోబర్ 13న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టింగ్ కానున్నాయి.
దీని తరువాత LG ఎలక్ట్రానిక్స్ ఇండియా IPO అక్టోబర్ 7న ప్రారంభమై, అక్టోబర్ 9న ముగుస్తుంది. రూ.11,607.01 కోట్ల విలువైన ఈ ఇష్యూలో ఒక్కో షేరుకు రూ.1,080 నుండి రూ.1,140 ధర పరిధిలో బిడ్లు సమర్పించవచ్చు. లాట్ సైజు 13 షేర్లుగా నిర్ణయించబడింది. ఈ కంపెనీ షేర్లు అక్టోబర్ 14న ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టవుతాయి.
అదేవిధంగా, అనంతం హైవేస్ ట్రస్ట్ ఇన్విట్ IPO అక్టోబర్ 7న ప్రారంభమై అక్టోబర్ 9న ముగుస్తుంది. రూ.400 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఇష్యూకు ధర పరిధి ఒక్కో షేరుకు రూ.98 నుండి రూ.100గా నిర్ణయించారు. అక్టోబర్ 17న షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవుతాయి.
మిట్టల్ సెక్షన్స్ IPO కూడా అక్టోబర్ 7న ప్రారంభమై అక్టోబర్ 9 వరకు కొనసాగుతుంది. రూ.52.91 కోట్ల విలువైన ఈ ఇష్యూలో ఒక్కో షేరుకు రూ.136 నుండి రూ.143 ధరల మధ్య బిడ్లు సమర్పించవచ్చు. లాట్ సైజు 1,000 షేర్లుగా ఉంది. ఈ షేర్లు అక్టోబర్ 14న BSE SMEలో లిస్టవుతాయి.
ఇక రూబికాన్ రీసెర్చ్ IPO అక్టోబర్ 9న ప్రారంభమై అక్టోబర్ 13న ముగుస్తుంది. రూ.1,377.50 కోట్ల విలువైన ఈ ఇష్యూకు ఒక్కో షేరుకు రూ.461 నుండి రూ.485 వరకు ధర పరిధి నిర్ణయించగా, లాట్ సైజు 30 షేర్లుగా ఉంది. షేర్లు అక్టోబర్ 16న లిస్ట్ అవుతాయి.
ఇప్పటికే మార్కెట్లో (Stock Market) కొనసాగుతున్న ఐపీఓలలో DSM ఫ్రెష్ ఫుడ్స్, గ్రీన్‌లీఫ్ ఎన్విరోటెక్, శ్లోక్కా డైస్, మరియు వీవర్క్ ఇండియా మేనేజ్‌మెంట్ ఉన్నాయి. DSM ఫ్రెష్ ఫుడ్స్ IPO సెప్టెంబర్ 26న ప్రారంభమై అక్టోబర్ 6న ముగుస్తుంది. రూ.59.06 కోట్ల విలువైన ఈ ఇష్యూకు ఒక్కో షేరుకు రూ.95 నుండి రూ.100 ధర పరిధి ఉంది.
గ్రీన్‌లీఫ్ ఎన్విరోటెక్ IPO సెప్టెంబర్ 30న ప్రారంభమై అక్టోబర్ 6న ముగుస్తుంది. రూ.21.90 కోట్ల విలువైన ఈ ఇష్యూకు ఒక్కో షేరుకు రూ.136 ధర నిర్ణయించబడింది. అక్టోబర్ 9న NSE SMEలో షేర్లు లిస్ట్ అవుతాయి.
శ్లోక్కా డైస్ IPO కూడా సెప్టెంబర్ 30న ప్రారంభమై అక్టోబర్ 6న ముగుస్తుంది. రూ.63.50 కోట్ల విలువైన ఈ ఇష్యూలో ఒక్కో షేరుకు రూ.95 నుండి రూ.100 ధర పరిధి నిర్ణయించారు.
ఇక ప్రధాన మార్కెట్‌లో (Stock Market) కొనసాగుతున్న వీవర్క్ ఇండియా మేనేజ్‌మెంట్ IPO అక్టోబర్ 3న ప్రారంభమైంది. రూ.3,000 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఇష్యూకు ఒక్కో షేరుకు రూ.615 నుండి రూ.648 వరకు ధర పరిధి నిర్ణయించబడింది.
నిపుణుల అంచనాల ప్రకారం, ఈ వారం మార్కెట్లోకి (Stock Market) వస్తున్న ఐపీఓలు పెట్టుబడిదారుల నుండి బలమైన స్పందన పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా టాటా క్యాపిటల్, LG ఎలక్ట్రానిక్స్ వంటి ప్రముఖ కంపెనీల ఐపీఓలు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Also Read : Gold Price Growth : పాకిస్థాన్‌లో బంగారం ధరలు ఎగిసిపడుతున్నాయి – 10 గ్రాములకు రూ.3.5 లక్షలు!



















