Stock Market : కేంద్రం ప్రకటించిన తాజా జీఎస్‌టీ సంస్కరణలు దేశీయ స్టాక్ మార్కెట్‌కు (Stock Market) ఊతమిస్తున్నాయి. గత వారం నష్టాలను చవిచూసిన సూచీలు ఈ వారం లాభాల్లో కొనసాగుతున్నాయి. జీఎస్‌టీ శ్లాబుల్లో మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధి దిశకు తోడ్పడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మదుపర్లలో విశ్వాసం పెరగడంతో మార్కెట్లు పాజిటివ్ ట్రెండ్‌లో కదులుతున్నాయి.
గురువారం ఉదయం సెన్సెక్స్ భారీ లాభాలతో ప్రారంభమైంది. బుధవారం ముగింపులో (80,567) ఉన్న సెన్సెక్స్, ఉదయం సుమారు 900 పాయింట్ల లాభంతో తెరుచుకుంది. ఉదయం 10:30 గంటలకు 457 పాయింట్లు పెరిగి 81,024 వద్ద కొనసాగింది. ఇదే సమయంలో నిఫ్టీ కూడా 138 పాయింట్ల లాభంతో 24,853 వద్ద ట్రేడవుతోంది.
Stock Market – లాభాల్లో ఉన్న రంగాలు
సెన్సెక్స్‌లో ఎమ్ అండ్ ఎమ్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, కోల్గేట్, పీబీ ఫిన్‌టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మరోవైపు పేటీఎమ్, కల్యాణ్ జువెల్లర్స్, పిరామిల్ ఫార్మా, కోఫోర్జ్ లిమిటెడ్, సెయిల్ షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.
ఇతర సూచీలు
నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 152 పాయింట్ల లాభంతో, బ్యాంక్ నిఫ్టీ 175 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.09 వద్ద స్థిరంగా ఉంది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, తాజా జీఎస్‌టీ సంస్కరణలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరచి రాబోయే రోజుల్లో సూచీలకు మరింత మద్దతు ఇవ్వవచ్చని అంచనా.
Also Read : GST Reforms Growth : జీఎస్టీ రిఫార్మ్స్ తో కొత్త ఉద్యోగాల వృద్ధికి సాయం



















