Stock Market : దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల (Stock Market) నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కోతకు అవకాశముందనే అంచనాలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని కలిగించాయి. ఫెడ్ వడ్డీ రేట్లపై నిర్ణయం బుధవారం వెలువడనుంది.
Stock Market Updates
సోమవారం ముగింపు స్థాయి (81,785)తో పోలిస్తే మంగళవారం సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. రోజంతా సానుకూల ధోరణి కొనసాగింది. 81,779–82,380 పాయింట్ల పరిధిలో కదిలిన సెన్సెక్స్ చివరికి 594 పాయింట్ల లాభంతో 82,380 వద్ద ముగిసింది. ఇదే ధోరణి నిఫ్టీలోనూ కనిపించింది. నిఫ్టీ 169 పాయింట్లు ఎగసి 25,239 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో సయింట్, హెచ్‌ఎఫ్‌సీఎల్, జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్, చోలా ఇన్వెస్ట్‌మెంట్స్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్ వంటి షేర్లు గణనీయమైన లాభాలను నమోదు చేశాయి. మరోవైపు వొడాఫోన్ ఐడియా, సింజెన్, గోద్రేజ్ కన్స్యూమర్, వరుణ్ బేవరేజెస్, ఇండియన్ హోటల్స్ షేర్లు నష్టపోయాయి.
ఇక నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 313 పాయింట్లు లాభపడగా, బ్యాంక్ నిఫ్టీ 259 పాయింట్లు ఎగబాకింది. కరెన్సీ మార్కెట్లో రూపాయి, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 88.05 వద్ద ట్రేడైంది.
Also Read : Trump Shocking “The New York Times” : న్యూయార్క్ టైమ్స్‌పై ట్రంప్ 15 బిలియన్ డాలర్ల పరువునష్టం దావా



















