Stock Market Sensational : స్టాక్ లు కొనేటపుడు ఆచితూచి వ్యవహరిం చాలంటున్న నిపుణులు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ విరమణపై స్పష్టత లేకపోవడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

Hello Telugu - Stock Market Sensational

Hello Telugu - Stock Market Sensational

Stock Market : దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబరులో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు తగ్గించే సూచనలు, దేశీయంగా జీఎస్‌టీ సంస్కరణలు సూచీలకు తోడ్పడే అంశాలుగా కనిపిస్తున్నాయి. అయితే అమెరికా-చైనా వాణిజ్య విధానాలు, ట్రంప్‌ టారిఫ్స్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ విరమణపై స్పష్టత లేకపోవడం మార్కెట్‌పై (Stock Market) ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

గత శుక్రవారం నిఫ్టీ 200 పాయింట్లకు పైగా పడిపోవడం లాభాల స్వీకరణను సూచిస్తోంది. అయితే మద్దతు లభిస్తే మార్కెట్‌ మళ్లీ పుల్‌బ్యాక్‌ ర్యాలీకి అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

Stock Market – స్టాక్‌ రికమండేషన్స్‌

ఎన్‌ఎస్‌డీఎల్‌ (NSDL)

కొద్ది రోజుల క్రితం లిస్టయిన ఈ షేరు ఐపీఓ తర్వాత మంచి స్థిరత్వాన్ని చూపిస్తోంది. శుక్రవారం రూ.1,275 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,250 స్థాయిలో ప్రవేశించి, రూ.1,450 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్‌: రూ.1,210.

ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌

కొన్ని నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో సాగిన ఈ షేరు ప్రస్తుతం రివర్సల్‌ సూచనలతో ఉంది. శుక్రవారం రూ.396 వద్ద ముగిసింది. రూ.380–390 శ్రేణిలో ఎంట్రీ తీసుకుని, రూ.455 లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్‌: రూ.370.

సుప్రీమ్‌ ఇండస్ట్రీస్‌

దీర్ఘకాలిక డౌన్‌ట్రెండ్‌ నుంచి బయటపడిన ఈ షేరు ప్రస్తుతం కీలక నిరోధం వద్ద ఉంది. శుక్రవారం రూ.4,637 వద్ద ముగిసింది. రూ.4,600 పరిధిలో ప్రవేశించి రూ.4,780 లక్ష్యంగా పెట్టుకోవచ్చు. స్టాప్‌లాస్‌: రూ.4,560.

ఇప్కా ల్యాబ్స్‌

కొన్ని నెలలుగా అక్యుములేషన్‌ జోన్‌లో ఉన్న ఈ షేరు రూ.1,350 స్థాయి నుంచి రివర్సల్‌ అయింది. శుక్రవారం రూ.1,418 వద్ద ముగిసింది. రూ.1,400 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.1,580–1,650 లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్‌: రూ.1,360.

ఆదిత్య ఇన్ఫోటెక్‌

కొద్దికాలం క్రితం లిస్టయిన ఈ షేరు వేగంగా రాణిస్తోంది. శుక్రవారం రూ.1,360 వద్ద ముగిసింది. రూ.1,300 పరిధిలో ఎంట్రీ తీసుకుని రూ.1,550 లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చు. రిస్క్‌ ప్రొఫైల్‌ బట్టి దీర్ఘకాలానికి మదుపు చేయవచ్చు. స్టాప్‌లాస్‌: రూ.1,260.

Also Read : Today Gold Price : నేడు స్వల్ప తగ్గుదలతో నడుస్తున్న పసిడి ధరలు

Exit mobile version