Stock Market : విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు దిగటంతో దేశీయ సూచీలు నాలుగో రోజు వరుసగా నష్టాలను నమోదు చేస్తున్నారు. అమెరికా హెచ్1బీ వీసా విధానంలో తీసుకున్న నిర్ణయం, రూపాయి డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం, అలాగే ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు (Stock Market) ఓవర్ వెయిట్ జోన్‌లో ఉన్నట్టు హెచ్‌ఎస్‌బీసీ సూచించడం కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ నెగిటివ్‌లో ఉన్నాయి.
Stock Market – సూచీల స్థితి
- సెన్సెక్స్: గురువారం ఉదయం 185 పాయింట్ల నష్టంతో 81,529 వద్ద కొనసాగుతోంది.
- నిఫ్టీ: 51 పాయింట్ల నష్టంతో 25,004 వద్ద ఉంది.
- నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్: 53 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.
- బ్యాంక్ నిఫ్టీ: 33 పాయింట్ల నష్టంతో ఉంది.
షేర్స్ ప్రదర్శన
- లాభాల్లో: ఆయిల్ ఇండియా, కేపీఐటీ టెక్, కేఫిన్ టెక్, వేదాంత, టిటాగర్ రైల్
- నష్టాల్లో: టాటా మోటార్స్, ఆస్ట్రాల్ లిమిటెడ్, ఇన్ఫో ఎడ్జ్, పేటీఎమ్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్
ఇతర వివరాలు
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹88.64 వద్ద ఉంది.
మార్కెట్ నిపుణులు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు మరియు అంతర్జాతీయ పరిస్థితులు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలని విశ్లేషిస్తున్నారు.
Also Read : Gold Price Drop : నేడు మరోసారి దిగువకు వచ్చిన పసిడి ధరలు



















