SSMB29 : దర్శక ధీరుడు అనే పేరు ఊరికే రాలేదు ఎస్ఎస్ రాజమౌళికి(Rajamouli). తను చదువుకున్నది తక్కువే అయినా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తన పేరు గుర్తు పెట్టుకునేలా సినిమాలు తీశాడు. ఈగ, మర్యాద రామన్న, విక్రమార్కుడు, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తనేమిటో, తన సత్తా ఏపాటిదో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబుతో ప్రతిష్టాత్మకమైన అడ్వెంచర్ తో కూడిన సినిమాను ప్లాన్ చేశాడు.
SSMB29 Movie 3rd Schedule..
తనతో సినిమా అంటే హీరోలకు ఇబ్బందే. ఎందుకంటే తను ఏ సినిమాను త్వరగా తీయడు. తనకు నచ్చేంత వరకు చిత్రీకరణ జరుపుతూనే ఉంటాడు. ముందే ఈ విషయం సినీ టెక్నీషియన్స్ కు, నటీ నటులకు చెప్పేస్తాడు. ఏ ఇతర ప్రాజెక్టులతో ఉండకుండా జాగ్రత్త పడతాడు. అంతే కాదు కాంట్రాక్ట్ కూడా చేసుకుంటాడు.
ఎందుకంటే తను తీసేది చిన్న సినిమా కాదు. భారీ బడ్జెట్ తో కూడుకుని ఉన్నది. ఏ మాత్రం తేడా వచ్చినా అది తన కెరీర్ కు ఇబ్బంది. అందుకే ఆచి తూచి అడుగులు వేస్తాడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తో నటించడం అంటే ఒక రకంగా అందమైన జైలులో ఉండడం లాంటిదన్నాడు ఓ హీరో. ఇది పక్కన పెడితే ఎక్కడికీ వెళ్లకుండా కండీషన్స్ పెట్టాడు హీరో మహేష్ బాబుకి. షూటింగ్ ఆ తర్వాత కుటుంబం. ఏ మాత్రం వీలు చిక్కినా వెంటనే విదేశాలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఎప్పుడైతే జక్కన్నతో జత కట్టాడో ప్రిన్స్ కు ఇబ్బందిగా మారినట్లు తెలిసింది.
ఇక ఎస్ఎస్ఎంబీ 29(SSMB29) సినిమా షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగగగా రెండో షెడ్యూల్ ఒడిశా అడవుల్లో తీశాడు. ప్రస్తుతం మూడో షెడ్యూల్ కోసం ఎస్ఎస్ రాజమౌళి రెడీ అయ్యాడని టాక్. మొత్తంగా కొంత గ్యాప్ దొరకడంతో విదేశానికి చెక్కేసిన ప్రిన్స్ ఉన్నట్టుండి హైదరాబాద్ కు విచ్చేశాడని , షూటింగ్ లో భాగం కానున్నట్లు టాక్. ఎంతైనా జక్కాన్నా మజాకా కదూ.
Also Read : Hero Nithin Reddy :నితిన్ రెడ్డి మోసం నిర్మాత ఆగ్రహం..?