Srisailam Project : కర్నూలు జిల్లా – ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు (Srisailam Project) పెద్ద ఎత్తున నీరు చేరుతుండడంతో గరిష్ట నీటి మట్టంకు చేరుకుంది. దీంతో గేట్లు ఎత్తాలా వద్దా అనే విషయంలో డ్యామ్ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాక పోవడంతో సందిగ్ధంలో పడ్డారు. లేకపోతే గతంలో తుంగభద్ర ప్రాజెక్టు సంఘటన పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. గంట గంటకు వరద నీరు ఉధృతంగా చేరుతోంది. ఇదిలా ఉండగా శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా గరిష్ట నీటి నిల్వ 215 టీఎంసీలుగా ఉంది.
Srisailam Project Alarming
ప్రస్తుతం వరద ఉధృతి కారణంగా నీటి నిల్వ 880 అడుగులు ఉంది. 190 టీఎంసీలను దాటేసింది. డ్యాంలోకి ఒక లక్షా 75 వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. పవర్ జనరేషన్ ,సాగునీటి కాలువల ద్వారా అవుట్ ఫ్లో 60 వేల క్యూసెక్కులుగా ఉంది. డ్యాం ను పరిశీలించారు సోమవారం ప్రభుత్వ సలహాదారు,రి జర్వాయర్ల ఇంజనీరింగ్ నిపుణులు కన్నయ్య నాయుడు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి డ్యాంకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదన్నారు. ఫ్లుంజ్ ఫుల్ గొయ్యితోనే ప్రమాదం ఉందన్నారు. కుడి, ఎడమ పవర్ జనరేషన్ పునాదుల కు ముప్పు ఏర్పడిందన్నారు. డ్యాం గేట్లకు 2010 నుంచి రంగులు వేయ లేదన్నారు. కొన్ని తుప్పు పట్టాయన్నారు. ఆందోళన చెందాల్సినంత లీకేజీలు లేవన్నారు.
Also Read : Bhumana Sensational Comments : చంద్రబాబు మేనిఫెస్టో బక్వాస్ – భూమన


















