Sri Sri Sri Nanjavadootha Swami : బెంగళూరు : కర్ణాటక రాజకీయం రోజు రోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో కీలక ఓటు బ్యాంకు కలిగి ఉంది వొక్కలిగ సామాజిక వర్గం. ఈ వర్గానికి చెందిన వారే ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్. శుక్రవారం ఆయన అనుకోకుండా ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా భావించే శ్రీశ్రీశ్రీ నంజవదూత స్వామీజీని (Sri Sri Sri Nanjavadootha Swami) మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. వీరిద్దరి మధ్య రాజకీయ పరమైన చర్చలు కొనసాగాయి. డీకేఎస్ కలిసిన వెంటనే స్వామీజీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర రాజకీయాలలో చర్చకు దారితీసేలా చేశాయి. రాష్ట్రంలో ఏ పార్టీ పవర్ లోకి రావాలన్నా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన స్వామీజీలు, మఠాధిపతులే కీలకమైన రోల్ పోషిస్తారు. డీకే కలిసిన వెంటనే స్వామీజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు సీఎం మార్పునకు సంబంధించి.
Sri Sri Sri Nanjavadootha Swami Demands
కన్నడ నాట అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన వొక్కలిగ సామాజిక వర్గానికి సంబంధించిన డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. శివకుమార్‌కు తన మద్దతును తెలిపారు.డికె శివకుమార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేశారని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు విధేయుడిగా ఉన్నారని ఆ ఆధ్యాత్మిక నాయకుడు ఉప ముఖ్యమంత్రిని ప్రశంసించారు. శివకుమార్ సమాజానికి చెందిన ప్రముఖ నాయకుడు, పార్టీకి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేం. ఆయన అపారమైన కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ సవాలుతో కూడిన సమయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతను అప్పగించినప్పటికీ, తను నిరుత్సాహ పడలేదు. పార్టీని బలోపేతం చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేశారని నంజవదూత స్వామీజీ అన్నారు. అహింద సమాజం తర్వాత, వొక్కలిగలకు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన నొక్కి చెప్పారు.
Also Read : CM Chandrababu – AP Growth : అమరావతిని దేశానికి రోల్ మోడల్ చేస్తాం

















