భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చిన‌ శ్రీ సోమస్కంద మూర్తి

అంగ‌రంగ వైభ‌వోపేతంగా బ్ర‌హ్మోత్స‌వాలు

hellotelugu-GajaVahanam

తిరుపతి : తిరుపతిలోని శ్రీ‌నివాస మంగాపురం శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి భ‌క్త బాంధ‌వులు తండోప తండాలుగా త‌రలి వ‌చ్చారు. స్వామి వారి ద‌ర్శ‌న భాగ్యం పొందేందుకు పోటీ ప‌డ్డారు. ఉత్స‌వాలను పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం నేతృత్వంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు భ‌క్తుల కోసం. ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ప్ర‌త్యేకించి భ‌క్తుల కోసం తొమ్మిది ర‌కాల‌తో అన్న ప్ర‌సాద విత‌ర‌ణ కొన‌సాగుతంది. ఇదిలా ఉండ‌గా ఉత్స‌వాల‌లో భాగంగా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి వారు శ్రీ సోమస్కంధమూర్తి గజ వాహనంపై అనుగ్రహించారు.

భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. ఆద్యంత రహితుడైన శివదేవుడు, ఐశ్వర్య సూచికమైన గజ వాహనాన్ని అధిష్టించినపుడు దర్శనం చేసుకోవడం భ‌క్తుల పుణ్యం. ఈ కార్యక్రమంలో సివిఎస్వో ముర‌ళికృష్ణ‌, ఆలయ ప్ర‌త్యేకాధికారి ఫ‌ణికుమార్ నాయుడు, సూపరింటెండెంట్ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

Exit mobile version