Sri Lalita Tripurasundari Devi : విజయవాడ : బెజవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. కనకదుర్గమ్మ ఆరాధనలో శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అవతారపు అలంకారం అపూర్వమైన ఆధ్యాత్మిక ఘట్టానికి ప్రతీకగా నిలిచింది. నవ రాత్రుల్లో ఆరవ రోజు శనివారం తల్లి శ్రీ లలితా త్రిపురసుందరి దేవి (Sri Lalita Tripurasundari Devi) అలంకారంలో దర్శనమిస్తున్నారు అశేష భక్తజనావాళికి. ఈ అవతారం శక్తి, సౌందర్యం, కరుణ, జ్ఞానం అనే నాలుగు శక్తుల సమన్వయ.
Sri Lalita Tripurasundari Devi Avatar Interesting
త్రిపురసుందరి అవతారం ప్రాధాన్యం ఇలా ఉంది. త్రిపురసుందరి దేవి శ్రీ విద్యా ఉపాసనలో అత్యంత గోప్యమైన రూపంగా భావిస్తారు. ఆమెను శ్రీ చక్రనాయకిని”గా, కామేశ్వరి”గా, శ్రీ లలితా మహా త్రిపురసుందరిగా (Sri Lalita Tripurasundari Devi) వేదాలు, ఆగమాలు, తంత్రాలు కీర్తించాయి. తల్లి త్రిపురసుందరి సకల లోకాలను కాపాడుతూ నిలుస్తుందని పురాణాలు చెబుతాయి. దేవి ఈ అవతారంలో పట్టు వస్త్రాలు, రత్నాభరణాలు ధరించి శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తారు.
తల్లి ముఖచంద్రుడిపై సింహాసనం నుంచి వెలువడే కాంతి భక్తుల హృదయాలను కట్టి పడేస్తుంది.
త్రిపుర సుందరి అవతారం సౌందర్య లహరిలో వర్ణించిన మహిమలను సజీవ రూపంలో ప్రతిబింబిస్తుంది. పుష్పాలతో చేసిన అలంకారంలో ముఖ్యంగా పసుపు, కుంకుమ, గులాబీ, మల్లె పువ్వులు దేవి చుట్టూ శక్తి వలయంలా అలంకరిస్తారు. రోజున తల్లి త్రిపుర సుందరి దర్శనం కలిగిన వారికి సౌభాగ్యం, ఐశ్వర్యం, విద్యా జ్ఞానం ప్రసాదమవుతుందని విశ్వాసం. వివాహ యోగం ఆలస్యమవుతున్న యువతులు ఈ రోజున తల్లి వద్ద ప్రార్థనలు చేస్తే త్వరితంగా వివాహమవుతుందని పురాణ కథనాలు చెబుతాయి.
విద్యాభివృద్ధి కోరే విద్యార్థులు కూడా ప్రత్యేక పూజలు చేసి, తల్లి ఆశీర్వాదం పొందుతారు.త్రిపుర సుందరి దేవి అలంకారం మనకు తెలియజేసేది. నిజమైన సౌందర్యం వెలుపలి అందంలో కాక, మనసులోని నిర్మలత్వం, జ్ఞానం, ప్రేమ, కరుణలో ఉంటుందని. తల్లి త్రిపుర సుందరి సాక్షాత్కారంతో భక్తుల మనసులు పవిత్రమై, ధర్మ మార్గంలో నడిపిస్తుంది. నవ రాత్రుల ఆరవ రోజు శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకారం అనేది కేవలం ఒక దృశ్య విందు కాదు. అది ఆధ్యాత్మికత, సౌందర్యం, జ్ఞానం, కరుణల సమన్వయమై ఉన్న తల్లిదేవి మహిమ. కనకదుర్గ ఆలయంలో ఈ అలంకారం చూసిన భక్తులు జీవితాంతం మరువలేని అనుభూతి పొందుతారు.
Also Read : CM Revanth Reddy Important Meeting : ముంచెత్తిన వర్షాలపై సీఎం సమీక్ష
