తిరుమల : తిరుమలలోని శ్రీవారి కళ్యాణ వేదిక వద్ద ఉన్న పురోహిత సంఘం ఆధ్వర్యంలో భక్తులు, గృహస్తులకు అవసరమైన వివిధ సంప్రదాయ పూజ కార్యక్రమాలను నిర్దేశిత రుసుముతో నిర్వహిస్తున్నారు. ఈ పురోహిత సంఘం ద్వారా వివాహం, ఉపనయనం, సత్యనారాయణ వ్రతం, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహన పూజ తదితర ముఖ్యమైన ధార్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు భక్తుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాలను తక్కువ ఖర్చుతో చేసుకునే విధంగా టీటీడీ అందుబాటులో ఉంచింది. కళ్యాణ వేదిక వద్ద పురోహిత సంఘం ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరియు ఫీజులు ఇలా ఉన్నాయి.
వివాహ కార్యక్రమానికి ఎలాంటి రుసుము ఉండదని పూర్తిగా ఉచితమని తెలిపింది. ఉప నయనం కోసం రూ. 300 , సత్య నారాయణ వ్రతం జరిపించేందుకు రూ. 300 , కేశ ఖండన కోసం రూ. 200, నామ కరణం చేసేందుకు రూ. 200, అన్న ప్రాసనకు రూ. 200, అక్షర అభ్యాసం కోసం రూ. 200, వాహన పూజకు రూ. 200, చెవి పోగులు కుట్టేందుకు రూ. 50, ఇదే క్రమంలో చెవిపోగులు కుట్టడం (కాటేజ్‌లో) రూ.100, మేళం ఒక సెట్టుకు రూ. 100 , మేళం రెండు సెట్లు రూ. 300 , దస్త్ర పూజకు రూ.200, ఇతర ధార్మిక కార్యక్రమాల కోసం రూ. 200 ఉంటాయని స్పష్టం చేసింది.



















