TTD Important Festivals : ఆగస్టు నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

hellotelugu-ttd

TTD : తిరుమ‌ల – టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆగ‌స్టు నెల‌కు సంబంధించి శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగే కార్య‌క్ర‌మాల గురించి వివ‌రించింది. స్వామి వారి ఆల‌యంలో జ‌ర‌గ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆగ‌స్టు 2న మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్థంతి నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. 4న 4న తిరుమ‌ల శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ ఉంటుంది. 5న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం అవుతాయి. 7న తిరుమ‌ల శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాలు స‌మాప్తి.

TTD Key Festivals Update

ఇదే క్ర‌మంలో ఆగ‌స్టు 8న ఆళ్వందార్ల వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం ఉంటుంద‌ని తెలిపింది టీటీడీ. 9న శ్రావ‌ణ పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌, 10న‌ తిరుమ‌ల శ్రీ‌వారు విఖ‌న‌సాచార్యులవారి స‌న్నిధికి వేంచేపు చేస్తారు. 16న గోకులాష్ట‌మి ఆస్థానం. 17న తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిన శిక్యోత్స‌వం. 25న బ‌ల‌రామ జ‌యింతి, వ‌రాహ‌ జ‌యంతి నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈవో జె. శ్యామ‌ల రావు వెల్ల‌డించారు.

ఇదిలా ఉండగా చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళవారం సుమారు రూ.2.40 కోట్లు విలువైన దాదాపు రెండున్నర కేజీల బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి శంఖు, చక్రాలను అందజేశారు.

Also Read : TTD – Huge Donations : చెన్నైకి చెందిన భక్తుడు శ్రీవారికి భారీ విరాళం..శంకు, చక్రాలు భూరి

Exit mobile version