South Central Railway : దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 25వ తేదీ (జూన్ 25) నుంచి మదనపల్లె క్రాస్ (CTM) వరకు పొడిగించనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా ఆ ప్రాంత ప్రయాణికులకు రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
South Central Railway Innovative
ప్రస్తుతం గుంటూరు (Guntur) నుంచి బయలుదేరే ఈ రైలు ఉదయం 6:23 గంటలకు పీలేరు చేరుతుంది. పీలేరు నుంచి ఇది నేరుగా మదనపల్లె క్రాస్ వరకు ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు మదనపల్లె క్రాస్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:00 గంటలకు బయలుదేరి, పీలేరు (3:47), పాకాల, తిరుపతి మీదుగా తిరిగి గుంటూరుకు చేరుతుంది.
ఈ రూట్ పొడిగింపుతో మదనపల్లె, పీలేరు పరిసర ప్రాంతాల ప్రయాణికులకు గుంటూరు, తిరుపతి వంటి ముఖ్య పట్టణాలకు నేరుగా చేరుకోవడం మరింత సులభమవుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారులు, ఆధ్యాత్మిక ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. రైల్వే అధికారులు ఈ ప్రత్యేక సర్వీసును జూలై 31వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వం తరఫున రవాణా సౌకర్యాలు విస్తరించడానికి ఇది మంచి ముందడుగుగా అభిప్రాయపడుతున్నారు స్థానిక ప్రజలు. దీనివల్ల దూరప్రాంత ప్రయాణాలు తక్కువ ఖర్చుతో, సురక్షితంగా సాగుతాయని పేర్కొన్నారు.
Also Read : Tesla New Innovation : భారత్ లోని ప్రధాన నగరాల్లో టెస్లా విక్రయ కేంద్రాలు



















