కోల్ కతా : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానంగా స్టార్ క్రికెటర్, బౌలర్ గా పేరు పొందిన మహమ్మద్ షమీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. షమీ పూర్తిగా ఫిట్ గా ఉన్నాడని, తను దేశీవాళి ఫార్మాట్ లో జరిగిన అన్ని టోర్నీలలో పాల్గొన్నాడని, అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడని చెప్పారు. సౌరవ్ గంగూలీ సోమవారం మీడియాతో మాట్లాడారు. తన వరకు చూస్తే తను పూర్తిస్థాయి ఆరోగ్య పరంగా ఉన్నాడని పేర్కొన్నాడు. తను భారత దేశం తరపున ప్రాతినిధ్యం వహించేందుకు అన్ని విధాలుగా అర్హుడేనని స్పష్టం చేశారు సౌరవ్ గంగూలీ.
అయితే గత కొంత కాలంగా బీసీసీఐ అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన పరిశీలనలో పూర్తిగా క్రికెటర్లు, బీసీసీఐ మధ్య పెద్ద ఎత్తున కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని తేలిందన్నారు. ఇది సంస్థకు మంచి పద్దతి కాదని సూచించారు. ప్రతిభా పాటవాలను కలిగిన ఆటగాళ్లను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశాడు సౌరవ్ గంగూలీ. ఆయన మరో స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి కూడా ప్రస్తావించాడు. అయితే మరో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అసలు ఈ గ్యాప్ క్రికెటర్లు, బీసీసీఐ మధ్య ఎందుకు ఉందని ప్రశ్నించాడు. అంతే కాదు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కు చురకలు అంటించాడు.



















