నేపాల్ : ఆకస్మిక వరదలతో నేపాల్ అతలాకుతలం అవుతోంది. భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. ఇదిలా ఉండగా దేశం క్లిష్ట సమయంలో, అన్నార్థులకు అండగా నిలిచిన ఘనత ప్రముఖ నటుడు సోనూ సూద్ కు పేరుంది. ఆయన కరోనా సమయంలో కూడా ఆదుకున్నాడు. వేలాది మందికి అండగా నిలిచాడు. వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. తాజాగా నేపాల్ లో వరద బాధితుల కోసం అండగా నిలిచేందుకు కంకణం కట్టుకున్నాడు నటుడు సోనూ సూద్. సహాయక సామగ్రితో నేపాల్ చేరుకున్నారు. తన ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ బృందం భారతదేశం నుండి అత్యవసర సామగ్రిని తీసుకు వచ్చిందని, రాబోయే నెలల్లో కూడా ప్రభావిత ప్రజలకు మద్దతునిస్తూనే ఉంటామని సోనూ సూద్ తెలిపారు.
ఇదిలా ఉండగా గత వారం నేపాల్‌ను అతలాకుతలం చేసిన భారీ వరదల బాధితులకు అండగా నిలిచేందుకు నటుడు సోనూ సూద్ అక్కడికి చేరుకున్నారు. ఆయన బృందం సహాయక చర్యలను సమన్వయం చేస్తోంది. తాము వరద బాధితులను కలవడానికి ఇక్కడికి వచ్చామన్నారు. భారతదేశం నుండి చాలా సామగ్రిని తీసుకు రావడం జరిగిందని తెలిపారు సోనూ సూద్. అవసరంలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలని, వారి జీవితాలను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రయత్నించాలని తాము ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో ఇంకా ఏమి అవసరమో తమ బృందం పరిశీలిస్తోందని సూద్ చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించడం అవసరమని నేను భావిస్తున్నాను. తాము చాలా దుప్పట్లు, ఆహార పదార్థాలను తీసుకు వచ్చినట్లు తెలిపారు.
భారతదేశం నుండి నేపాల్‌కు సామగ్రిని పంపడం ఎప్పుడూ కొంత సవాలుతో కూడుకున్నదే, ఎందుకంటే దీనికి చాలా మంది సిబ్బంది అవసరం అని ఆయన పేర్కొన్నారు. తక్షణ సంక్షోభం దాటిన తర్వాత కూడా తమ సహాయాన్ని కొనసాగించాలని ఫౌండేషన్ భావిస్తోందని సోనూ సూద్ తెలిపారు.
