Sonam Wangchuk : లడఖ్ : ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ (Sonam Wangchuk) ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించింది ఆయన భార్య గీతాంజలి జె ఆంగ్మో . తన భర్తను అన్యాయంగా, ఎలాంటి కారణం లేకుండానే అదుపులోకి తీసుకున్నారంటూ వాపోయింది. ఈ మేరకు శుక్రవారం ఆమె తన భర్తకు ప్రాణహాని ఉందని, వెంటనే విడుదల చేయాలని కోరుతూ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. న్యాయవాది సర్వమ్ రితం ఖరే ద్వారా పిటిషన్ దాఖలు చేసింది. వాంగ్‌చుక్ నిర్బంధాన్ని సవాలు చేస్తూ, అతనిని వెంటనే విడుదల చేయాలని కోరింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని గత కొంత కాలంగా తన భర్త తో పాటు మరికొందరు న్యాయ పోరాటం చేస్తున్నారని తెలిపారు దావాలో.
Sonam Wangchuk Wife Visit Supreme Court
భారత రాజ్యాంగంలో పొందు పర్చిన ఆర్టికల్ ఆరవ షెడ్యూల్ ద్వారా ప్రత్యేక హోదా కావాలంటూ అడగడం తప్పు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో ఇటీవల పలువురు రోడ్లపైకి వచ్చారు. తమ నిరసనలను వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 80 మందికి పైగా గాయపడ్డారు. దీనికి సంబంధించి మొత్తం ఆందోళన వెనుక సోనమ్ వాంగ్ చుక్ ఉన్నారంటూ కేంద్ర హోం శాఖ ఆరోపించింది. ఆ మేరకు రాష్ట్ర గవర్నర్ జనరల్ ఆదేశాల మేరకు తనను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. అంతే వాంగ్ చుక్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. తను పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్ లో కూడా పర్యటించాడని పేర్కొంది. గత సెప్టెంబర్ 26న వాంగ్ చుక్ ను నాసా కింద అరెస్ట్ చేసింది.
Also Read : Osmania Hospital New Innovation : ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాల నిర్మాణం
