Sonam Wangchuk : న్యూఢిల్లీ : ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ (Sonam Wangchuk) నిర్బంధాన్ని సవాల్ చేస్తూ తన భార్య గీతాంజలి పిటిషన్ దాఖలు చేసింది. ఈమేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును అక్టోబర్ 6న సోమవారం విచారణ చేపట్టనుంది. కాగా సుప్రీంకోర్టు కాజ్ లిస్ట్ ప్రకారం ఈ పిటిషన్ న్యాయమూర్తులు అరవింద్ కుమార్, ఎన్ వి అంజరియాలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధించడాన్ని సవాలు చేసింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆయన భార్య గీతాంజలి జె అంగ్మో దావా దాఖలు చేసింది.
Sonam Wangchuk Case
లడఖ్‌కు రాష్ట్ర హోదా , ఆరవ షెడ్యూల్ హోదా డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనల్లో కేంద్రపాలిత ప్రాంతంలో నలుగురు మరణించగా, 90 మంది గాయపడ్డారు. ఈ ఘటన రెండు రోజుల తర్వాత, సెప్టెంబర్ 26న వాంగ్‌చుక్‌ను కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా సీనియర్ న్యాయవాది వివేక్ తంఖా, న్యాయవాది సర్వమ్ రితం ఖరే ద్వారా దాఖలు చేసిన ఆమె పిటిషన్‌లో. వాంగ్‌చుక్‌పై ఎన్ఎస్ఏను ప్రయోగించాలనే నిర్ణయాన్ని కూడా ఆంగ్మో ప్రశ్నించారు. ఇది 12 నెలల వరకు విచారణ లేకుండా నిర్బంధించడానికి వీలు కల్పిస్తుంది. హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేస్తూ, నిర్బంధించబడిన కార్యకర్త జీవిత భాగస్వామి పిటిషన్‌ను అత్యవసరంగా జాబితా చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.
Also Read : Satya Kumar Yadav Important Update : వైద్యుల డిమాండ్లను పరిష్కరిస్తాం : సత్యకుమార్
