జ‌గ‌న్ రెడ్డిని హిందువులు క్ష‌మించ‌రు : సోమిరెడ్డి

11 సీట్ల‌కే ప‌రిమితం చేసినా మార‌ని జ‌గ‌న్ రెడ్డి బుద్ది

hellotelugu-SomireddyChndraMohanReddy

నెల్లూరు జిల్లా : టీడీపీ సీనీయ‌ర్ నేత‌, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌లు గ‌త ఎన్నికల్లో 11 సీట్ల‌కే ప‌రిమితం చేసినా, ఇంకా వైసీపీ నేత‌ల‌కు ప్ర‌ధానంగా ఆపార్టీ చీఫ్ కు బుద్ది రాలేద‌న్నారు. జ‌నం ఛీకొడుతున్నా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. అహంకారంతో మాట్లాడితే ఏ దేవుడు కూడా క్షమించడని గుర్తుంచుకో అని మండిప‌డ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాల్సిందేన‌ని డిమాండ్ చేశారు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి. తిరుమల వేంకటేశ్వర స్వామి హుండి అంటే అంత లోకువగా ఉందా జగన్ అంటూ నిల‌దీశారు.

పరకామణి చోరీ కేసు విషయంలో అహకారంతో నిన్న నువ్వు మాట్లాడిన తీరును హిందూ సమాజం క్షమించదన్నారు. హుండి చోరీ చేస్తే తప్పేంటీ అంటావా, నీకు అస‌లు బుద్ది అనేది ఉందా అని ఫైర్ అయ్యారు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి. పవిత్రమైన శ్రీవారి హుండిలో చేయి పెట్టినా తప్పు లేదన్నట్టు మాట్లాడుతావా , అస‌లు నీకు సిగ్గు అనిపించ‌డం లేదా ఇలా మాట్లాడేందుకంటూ భ‌గ్గుమ‌న్నారు. కోర్కెలు తీరిన భక్తులు తమ ఒంటి మీదున్న నగలన్నింటినీ శ్రీవారికి సమర్పించుకుంటారని, ఇది గ‌త కొన్నేళ్లుగా ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. కానీ నువ్వు శ్రీవారినే నిలువు దోపిడీ చేసిన రకం అంటూ ఆరోపించారు. సీఎంగా ఉన్నప్పుడు శ్రీవారి విషయంలో నువ్వు అనేక పాపాలు చేశావని, అందుకే ప‌వ‌ర్ కు దూర‌మై పోయాయ‌ని, ఇక‌నైనా జాగ్ర‌త్త‌గా మాట్లాడాల‌ని వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version