Gold : గత కొన్ని వారాలుగా నిరంతరంగా పెరుగుతున్న బంగారం ధరలు శుక్రవారం (అక్టోబర్ 10) కొంతమేర తగ్గాయి. ఇటీవల వరుసగా రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరకు ఒక్కసారిగా బ్రేకులు పడటంతో వినియోగదారులకు కొంత ఊరట లభించింది. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్ పెరగడం వంటి అంశాలు ధరలను ప్రభావితం చేస్తున్నప్పటికీ, ఈ రోజు మాత్రం స్వల్ప తగ్గుదల నమోదైంది.
Gold Price Updates
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (Gold) ధర రూ.1,22,290గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,13,800గా నమోదైంది. అదే సమయంలో 18 క్యారెట్ల పసిడి ధర రూ.91,720గా ఉంది. ఇక వెండి ధర మాత్రం విరుద్ధ దిశలో పయనించింది. ఒక కిలో వెండి ధర రూ.1,80,000కు చేరింది. దీంతో వెండి మార్కెట్లో చురుకుదనం కొనసాగుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం (Gold) ధర 10 గ్రాములకు రూ.1,22,440గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,200గా నమోదైంది. నిన్నటితో పోల్చితే బంగారం ధరలు సుమారు వెయ్యి రూపాయల మేర తగ్గాయి. దేశంలోని పలు నగరాల్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,160గా, 22 క్యారెట్ల ధర రూ.1,13,810గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,290గా, 22 క్యారెట్ల ధర రూ.1,12,100గా ఉంది. చెన్నైలో మాత్రం బంగారం ధరలు కొంత ఎక్కువగా ఉండి, 24 క్యారెట్లకు రూ.1,22,840, 22 క్యారెట్లకు రూ.1,12,600గా నమోదయ్యాయి.
వెండి ధరల విషయానికొస్తే, ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు 1.70 లక్షల నుంచి 1.80 లక్షల రూపాయల మధ్య ఉన్నాయి. విజయవాడ, కేరళలో వెండి ధర రూ.1,80,000గా ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైలో రూ.1,70,000 చొప్పున పలికింది.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు ఇంకా స్థిరంగా లేవు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకోబోయే నిర్ణయాలు, అంతర్జాతీయ ద్రవ్యోల్బణ పరిస్థితులు మరియు భౌగోళిక ఉద్రిక్తతలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
దీపావళి సీజన్ సమీపిస్తుండటంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని, దీంతో ధరలు మరల పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత తగ్గుదల వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం కలిగించిందని వారు పేర్కొన్నారు.
Also Read : RBI Shocking : ఆ బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్
