Mokshagundam : హైదరాబాద్ : భారత దేశం గర్వించ దగిన ఇంజనీర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సెప్టెంబర్ 15న ఆయన జయంతి. హైదరాబాద్‌ను వరదల నుండి రక్షించిన మహోన్నత వ్యక్తి. ఉస్మాన్ సాగర్ కు ప్రాణం పోసిన వ్యక్తి. హిమాయత్ సాగర్ ఆయన వల్లనే సాధ్యమైంది. భారత దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ దార్శనికులలో ఒకరైన భారతరత్న మోక్షగుండం (Mokshagundam) విశ్వేశ్వరయ్య జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. పునరావృతమయ్యే వరదల నుండి హైదరాబాద్‌ను రక్షించిన వాస్తు శిల్పిగా గౌరవించ బడుతున్నారు.
Mokshagundam Anniversary Today
1908లో మూసీ నది ఉప్పొంగి ప్రవహించి, వేలాది ఇళ్లు మునిగి పోయి దాదాపు 15,000 మంది ప్రాణాలను బలిగొన్నప్పుడు హైదరాబాద్ వినాశకరమైన వరదలను చూసింది. అటువంటి విపత్తులు పునరావృతం కాకుండా నిరోధించడానికి అప్పటి నిజాం విశ్వేశ్వరయ్యను ఆహ్వానించాడు. మూసీ, ఈసీ నదులపై భారీ ప్రాజెక్టులను నిర్మించాలని ప్రతిపాదించాడు. ఆయన కృషి ఫలితంగానే 1920లో ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు పూర్తయింది. 1927లో హిమాయత్ సాగర్ జలశయాన్ని ఆయన చలవ కారణంగానే నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇవి వరదలను నియంత్రించడమే కాకుండా జంట నగరాల ప్రధాన తాగునీటి వనరులుగా కూడా మారాయి.
విశ్వేశ్వరయ్య కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ సమీపలోని మద్దెనహళ్లిలో ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. కష్టాలు పడ్డాడు. పూణేలో స్కాలర్‌షిప్‌తో ఇంజనీరింగ్ చదివాడు . ప్రపంచంలోనే మొట్ట మొదటి ఆటోమేటిక్ ఫ్లడ్‌గేట్ వ్యవస్థను కనుగొన్నాడు. హైదరాబాద్‌తో పాటు, మైసూర్‌లోని కృష్ణరాజ సాగర్ జలాశయాన్ని రూపొందించడంలో, విశాఖపట్నం ఓడరేవును తీరప్రాంత కోత నుండి రక్షించడంలో , డ్రైనేజీ , పారిశుద్ధ్య వ్యవస్థలతో ఆధునిక నగర ప్రణాళికకు పునాది వేయడంలో ఆయన మార్గదర్శక పాత్ర పోషించారు.
Also Read : Team India Growth : ఈ విజయం ఆపరేషన్ సిందూర్ కు అంకితం
















