కెనడా – ప్రపంచ వ్యాప్తంగా తన పాటలతో అలరిస్తూ వస్తున్న ప్రముఖ పంజాబీ గాయకుడు శుభ్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెనడాలో ఖలిస్తానీ ఉద్యమం పేరుతో కొనసాగుతున్న ఆందోళనపై తీవ్రంగా స్పందించాడు.
సోషల్ మీడియా వేదికగా స్పందించాడు శుభ్ ప్రీత్ సింగ్. నేను ఎక్కడికి వెళ్లినా నన్ను ఆదరిస్తున్నారంటే కారణం నా భారత దేశం. నా దేశం నాకు గుర్తింపు ఇచ్చేందుకు తోడ్పాటు అందించింది. ఇవాళ నేను గొప్ప గాయకుడిగా ఎదిగేందుకు నా కంట్రీ నాకు సహకారం అందించందని పేర్కొన్నాడు శుభ్ ప్రీత్ సింగ్.
ఇవాళ కెనడాలో నేను టాప్ సింగర్ ను కావచ్చు గాక. కానీ అంత కంటే ముందు నేను మొదట భారతీయుడిని, ఆ తర్వాత పంజాబీని అని స్పష్టం చేశారు. తనకు కెనడా కంటే భారత దేశం ముఖ్యమని మరోసారి కుండ బద్దలు కొట్టాడు టాప్ సింగర్.
ఇదిలా ఉండగా తాను ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాననే నెపం వేశారని, తన టూర్ ను రద్దు చేశారని వాపోయాడు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నాడు శుభ్ ప్రీత్ సింగ్.