Jithender Reddy: ఆశక్తికరంగా ‘జితేందర్ రెడ్డి’ ట్రైలర్ !

ఆశక్తికరంగా 'జితేందర్ రెడ్డి' ట్రైలర్ !

Hello Telugu - Jithender Reddy

Jithender Reddy:ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి క్రియేషన్స్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రాకేష్ వర్రె లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Jithender Reddy:

ఇక ట్రైలర్ విషయానికి వస్తే… చిన్నప్పటినుండే సమాజం పట్ల అంకితభావం ఉన్న జితేందర్ రెడ్డి(Jithender Reddy), సమాజానికి ఏదో ఒక మంచి చెయ్యాలి అనే భావంతో పెరుగుతాడు. ఆ లక్షణాలు జితేందర్ రెడ్డితో పాటు పెరిగి, కాలేజీ ఎలక్షన్స్ లో లీడర్ గా ఎదిగి, ఆ తరవాత పోలీసు వ్యవస్థకే దీటుగా, సమాజంలో నక్సలైట్లు చేసే దోర్జన్యాలకు ఎదురు వెళ్తాడు. ట్రైలర్ మద్యలో హిందుత్వం వంటి డైలాగ్ లు మరింత ఆశక్తి పెంచేలా ఉన్నాయి. 1980 దశకంలో ఒక వ్యక్తి జీవితంలో జరిగే కాలేజీ పాలిటిక్స్, ఆ తరవాత నిజమైన రాజకీయాలు నేపధ్యంలో ఈ కథ సాగుతున్నట్టు ఉంది. మొత్తానికి ప్రేక్షకులను మెప్పించేలా కథ ఉంది. మే 10న ‘జితేందర్ రెడ్డి విడుదల కాబోతుంది అని చిత్ర యూనిట్ ట్రైలర్ ద్వారా తెలిపారు.

Also Read:-

 

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com