Singer Chinmayi : చెన్నై : ప్రముఖ నేపథ్య గాయని చిన్మయి శ్రీపాద (Singer Chinmayi) మరోసారి సంచలనంగా మారారు. తను తాజాగా కొరియా గ్రాఫర్ జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది . ఇదే సమయంలో కర్మ సిద్దాంతాన్ని గురించి ప్రస్తావించింది. అయితే అటు జానీ మాస్టర్ కానీ ఇటు కార్తీక్ కానీ ఇంకా చిన్మయి శ్రీపాద తమను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై స్పందించ లేదు. ఇక చిన్మయి శ్రీపాద ప్లేబ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు. ఇందుకు సంబంధించి ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలలో డ్యాన్స్ మాస్టర్, గాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ అవార్డు గెలుచుకున్న గాయని శ్రీపాద కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్‌లపై విమర్శలు గుప్పించారు. వీరిద్దరూ గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు.
Singer Chinmayi Sripada Slams Jani Master
ఇదిలా ఉండగా ప్రముఖ కవి వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేశారు. ఈ సందర్భంగా చిన్మయి శ్రీపాదకు మద్దతుగా పెద్ద ఎత్తున మీ టూ ఉద్యమం మొదలైంది. అయితే వైరముత్తు పై ఆరోపణలు చేసిన తర్వాత తమిళ డబ్బింగ్ ఆర్టిస్టుల సంఘం గతంలో చిన్మయిని నిషేధించింది, వినోద పరిశ్రమలో వేధింపులు. దుర్వినియోగానికి వ్యతిరేకంగా తన వైఖరిని నిరంతరం వినిపించింది. కర్మ సిద్ధాంతం పనిలో ఉంటే అది తిరిగి వచ్చి వారిని తిరిగి కొరికేస్తుంది అని ఆ ఇద్దరిని ఉద్దేశించి పేర్కొంది. జానీ మాస్టర్‌గా ప్రసిద్ధి చెందిన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టు చేయబడ్డారు. అక్టోబర్ 24, 2024న తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Also Read : MP Eatala Rajender Fired on Congress Govt : రిజర్వేషన్లు భిక్ష కాదు బీసీల ప్రధాన హక్కు

















