ముంబై : పాటల ప్రేమికులకు తీపి కబురు వచ్చేసింది. ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ తన సంగీత ప్రయాణంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, 2027లో భారతదేశంలోని తొమ్మిది నగరాల్లో పర్యటించనున్నట్లు ప్రకటించారు. భారీ స్టేడియం స్థాయిలో జరిగే ఈ పర్యటన జనవరి 2027లో మొదలై మే 2027 వరకు కొనసాగుతుంది. ఈ పర్యటన జనవరి 9, 2027న అహ్మదాబాద్‌లో ప్రారంభమై మే 15న హైదరాబాద్‌లో ముగుస్తుంది. ఇందుకు సంబంధించి పూర్తి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 9న అహ్మదాబాద్ లో, 23న చండీగడ్ లో , ఫిబ్రవరి 7న రాజస్తాన్ రాజధాని జైపూర్ లో , 20న మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో సంగీత కచేరి జరుగుతుందని వెల్లడించారు.
అర్జిత్ సింగ్ మార్చిలో బెంగళూరులో పర్యటిస్తారు. 13వ తేదీన బెంగళూరు నగరంలో మ్యూజిక్ కన్సర్ట్ ఉంటుది. 27వ తేదీన న్యూఢిల్లీ , ఏప్రిల్ 10వ తేదీన పూణేలో , మే11న ఇండోర్ న జరుగుతుంది. ఇక సింగర్ విషయానికి వస్తే ప్రసిద్ధ పాటలైన ‘తుమ్ హీ హో’ , ‘అగర్ తుమ్ సాత్ హోస , విదా కరో వంటి వాటిని ఈ వేదికలపై ఆలపించనున్నారు. ఈ కచేరీలు 360-డిగ్రీల స్పేషియల్ ఆడియో, పనోరమిక్ స్క్రీన్‌లు, కైనెటిక్ లెడ్ ఇన్‌స్టాలేషన్‌లు, లేజర్ ప్రదర్శనలు . స్టేడియం స్థాయి బాణసంచా ప్రదర్శనలతో కూడిన భారీ ఏర్పాట్లతో నిర్వహించబడతాయి.
తన సొంత కళాత్మక కృషిపై దృష్టి సారించేందుకు ప్లేబ్యాక్ సింగింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు అరిజిత్ ప్రకటించిన కొద్ది నెలలకే ఈ పర్యటన జరుగుతోంది రెండు దశాబ్దాల సంగీత ప్రయాణాన్ని వేడుకగా జరుపుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ పర్యటనను ‘టీమ్ ఇన్నోవేషన్’ నిర్వహిస్తుండగా, దీనికి సంబంధించిన టిక్కెట్లు ప్రత్యేకంగా ‘thumpN’ ద్వారా లభిస్తాయి.
