Simhagiri Karthikas Presence : సింహాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్తీక శోభ (Simhagiri Karthikas Presence) సంతరించుకుంది. ఆలయాలన్నీ భక్తులతో కిట కిట లాడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రపంచంలోనే ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో కార్తీక సందడి ప్రారంభమైంది.. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు సింహాద్రినాధుడిని, శ్రీదేవి భూదేవి అమ్మ వార్లను దర్శించుకుని తరించారు. స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. అలాగే అప్పన్న క్షేత్రపాలకుడు త్రిపురాంతక స్వామి ఆలయం, శ్రీ బాల త్రిపుర సుందరి. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తులు పరమశివుని పూజించి తరించారు.
Simhagiri Karthikas Presence Interesting
సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి .. డాక్ యార్డ్ కేటీబీ , అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీను బాబు దంపతులు సింహాద్రినాథుడు త్రిపురాంతక స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారి నిత్య కళ్యాణ సేవలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సింహగిరి అప్పన్న స్వామికి ప్రత్యేకంగా పూజలు చేశారు. వీరికి ఆశీర్వచనాలు అందజేశారు ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్ర పటం అందజేశారు. ఇక గుళ్లన్నీ కార్తీక శోభను సంతరించుకున్నాయి. ఎక్కడ చూసినా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
Also Read : Rohit Sharma-Kohli Sensational : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి అగ్నిపరీక్ష



















