Silver : బంగారం లాగానే వెండి కూడా ధరల్లో భారీ మార్పులను చూస్తోంది. కొంతమంది పెట్టుబడిదారులు వెండిని స్థిరమైన ఆస్తిగా భావించినా, గత వందేళ్ల ధరల ట్రెండ్ చూస్తే వెండి (Silver) బంగారం కంటే ఎక్కువ అస్థిరంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
Silver – వెండి ధరల్లో వందేళ్ల మార్పులు:
1925లో కిలో వెండి ధర రూ.50–100 మధ్య ఉండేది. ఆ తర్వాతి దశాబ్దాల్లో వెండి ధరలు తారుమారైనాయి. 1980లో రూ.2,715 చేరి ఆల్‌టైమ్ హయ్యెస్ట్‌గా నిలిచింది. 1985లో రూ.3,955, 1990లో రూ.6,463కి పెరిగింది. కానీ 1995 నాటికి మళ్లీ రూ.6,335కి తగ్గింది.
Silver – అప్ అండ్ డౌన్స్ స్పష్టంగా కనిపిస్తాయి:
1998లో వెండి ధర రూ.8,580కి పెరిగి 2000లో రూ.7,900కి తగ్గింది. 2004లో రూ.11,770 కాగా, 2005లో మళ్లీ రూ.10,675కి పడిపోయింది. అయితే 2008లో ఒక్కసారిగా రెట్టింపై రూ.23,625కి చేరుకుంది. 2015లో రూ.37,825గా ఉండగా, 2020లో దాదాపు రెండింతలై రూ.63,435కి చేరింది. ఇప్పుడు 2025 నాటికి కిలో వెండి ధర ₹1,67,000 చేరి కొత్త రికార్డు సృష్టించింది.
బంగారం కంటే ఎక్కువ అస్థిరం:
ఈ గణాంకాలను పరిశీలిస్తే వెండి ధరల్లో అస్తిరత బంగారంతో పోలిస్తే రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా ఉందని తేలుతోంది. బంగారం స్థిరంగా పెరుగుతూ ఉండగా, వెండి మాత్రం తక్కువ సమయంలోనే భారీ లాభాలు లేదా నష్టాలను చూపుతోంది.
పరిశ్రమల డిమాండ్ ప్రధాన కారణం:
నిపుణుల ప్రకారం వెండి ధరల్లోని మార్పులకు ప్రధాన కారణం పరిశ్రమలలో దీని వినియోగం. వెండిని ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి, మెడికల్ పరికరాలు వంటి విభాగాల్లో విస్తృతంగా వాడుతారు. ఈ రంగాల్లో వచ్చే మార్పులు వెండి మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపుతాయి.
పెట్టుబడిదారులకు హెచ్చరిక:
స్వల్పకాలిక పెట్టుబడిదారులు వెండి మార్కెట్లో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారంలా స్థిరమైన లాభాలు ఇవ్వకపోయినా, దీర్ఘకాలికంగా వెండి పెట్టుబడులు సరైన సమయాన్ని ఎంచుకుంటే మంచి రాబడులు ఇవ్వవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : Gold Price Growth : పసిడి పంజా! లక్షా 23 వేల దాటిన బంగారం ధరలు



















