Silver : దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వరుస పెరుగుదలతో పసిడి ధరలు జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరగా, వెండి (Silver) కూడా చరిత్రాత్మకంగా ఎగబాకింది. సమీప భవిష్యత్తులో కూడా ఈ ధోరణి కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Silver Price Shocking
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఆల్‌టైమ్ హై స్థాయికి చేరువలో ఉంది. ప్రస్తుతం ఇది ఔన్సుకు 3,480 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల బంగారం తులం ధర లక్ష రూపాయల మార్కును అధిగమించడం గణనీయమైన పరిణామం కాగా, ఇప్పుడు 22 క్యారెట్ల ధర కూడా లక్ష రూపాయల స్థాయికి చేరువలో కదులుతోంది.
హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.9,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.10,5880కి చేరింది. ఎంసిఎక్స్‌లోనూ పసిడి, వెండి ధరలు కొత్త జీవితకాల గరిష్ఠాలను నమోదు చేశాయి.
బంగారంపై పెరుగుతున్న డిమాండ్‌కు పలు కారణాలు ఉన్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా పసిడిపై ఆసక్తి పెరగడం, రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే కనిష్ఠ స్థాయికి పడిపోవడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలపై ఊహాగానాలు మొత్తం కలిపి బంగారం ధరల పెరుగుదలకు దోహదపడ్డాయి.
దేశంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారంపై డిమాండ్ మరింతగా పెరుగుతోంది. ఇదే సమయంలో వెండి కూడా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయంగా స్పాట్ సిల్వర్ ఒక్క రోజులోనే రెండు శాతం కంటే ఎక్కువ ఎగబాకి ఔన్సుకు 40.65 డాలర్ల మార్కును దాటింది. 2011 సెప్టెంబర్ తర్వాత ఇది 14 ఏళ్ల గరిష్ఠం.
దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1.26 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. నిపుణుల అంచనాల ప్రకారం, రాబోయే వారాల్లో కూడా బంగారం, వెండి ధరల్లో ఈ ఎగబాకే ధోరణి కొనసాగే అవకాశం ఉంది.
Also Read : Today Gold Price : ఎప్పుడు లేని రికార్డు సృష్టించిన పసిడి ధరలు



















