బెంగళూరు | కర్ణాటకలో ఇటీవల చేపట్టిన ఆక్రమణల తొలగింపుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలపై శనివారం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఒక రాష్ట్రానికి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తను ఇలా తెలుసు కోకుండా మాట్లాడటం భావ్యం కాదన్నారు డీకే. ఇది చాలా దురదృష్టకరం అని పేర్కొన్నారు. పినరయి వంటి సీనియర్ నాయకులకు బెంగళూరులోని సమస్యల గురించి తెలిసి ఉండాలని అన్నారు. అక్కడ కొందరు భూములను ఆక్రమించుకున్నారని చెప్పారు. అది చెత్త పారబోసే ప్రదేశం అని స్పష్టం చేశారు డీకే శివకుమార్.
మాకు మానవత్వం ఉందని స్పష్టం చేశారు. తాము అక్కడ ఉన్న కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వడం కూడా జరిగిందన్నారు డిప్యూటీ సీఎం. వారిలో కొద్దిమంది మాత్రమే స్థానికులు ఉన్నారని వెల్లడించారు. పినరయి వంటి సీనియర్ నాయకులు ఇలాంటి విషయాలలో జోక్యం చేసుకోకూడనని ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. మాకు బెంగళూరు గురించి బాగా తెలుసు అని స్పష్టం చేశారు. భూ మాఫియాలను సృష్టించాలనుకునే మురికివాడలను తాము ప్రోత్సహించాలని అనుకోవడం లేదన్నారు. తాము మా స్థలాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వాస్తవాలు తెలుసు కోకుండా జోక్యం చేసుకోకూడదని తాను కోరుతున్నట్లు పేర్కొన్నారు డీకే శివకుమార్. తాము బుల్డోజర్లు ఉపయోగిం లేదన్నారు.















