పంజాబ్ : కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరు పెడితే తిరిగి రాజకీయాల్లోకి వస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు తన భార్య నవజ్యోత్ కౌర్ . ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు చండీగఢ్ లో. ఏ పార్టీకి ఇవ్వడానికి తమ వద్ద డబ్బు లేదని అన్నారు. అయితే పంజాబ్‌ను స్వర్ణ రాష్ట్రంగా మార్చగలమని అన్నారు. ప్రస్తుతం పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కీలకమైన నేతలు కనుమరుగయ్యారని పేర్కొన్నారు. ఈ సమయంలో సిద్దూ లాంటి సమర్థవంతుడైన నాయకుడు పార్టీకి అత్యంత అవసరమన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారని నవజ్యోత్ కౌర్ సిద్ధూ అన్నారు.
తాము ఎల్లప్పుడూ పంజాబ్ , పంజాబీల కోసం మాట్లాడుతామన్నారు. కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి మా దగ్గర రూ. 500 కోట్లు లేవు అన్నారు. గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను కలిసిన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు వంటి అంశాలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇదే సమయంలో పంజాబ్ కాంగ్రెస్ యూనిట్లో అంతర్గత కలహాల గురించి కూడా పరోక్షంగా ప్రస్తావించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి కోసం ఐదుగురు నాయకులు ఆశిస్తున్నారని, వారు సిద్ధూను ముందుకు రానివ్వరని కౌర్ ఆరోపించారు.
















