Siddhi Vinayaka : చిత్తూరు జిల్లా – ప్రముఖ పుణ్య క్షేత్రం చిత్తూరు జిల్లాలోని వరసిద్ది వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. పూతల పట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం లో శ్రీ వరసిద్ధి వినాయక (Siddhi Vinayaka) స్వామి వారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. భారీ ఎత్తున భక్తులు చేరుకున్నారు.
Siddhi Vinayaka Festival Updates
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు జరగనున్న సందర్భంగా వినాయక చవితి పర్వదినమున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా పట్టు వస్త్రాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సమర్పించారు.
పట్టు వస్త్రాలు మంత్రివర్యుల తో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ , పూతల పట్టు, చిత్తూరు శాసన సభ్యులు కె.మురళీ మోహన్, గురజాల జగన్మోహన్, , చిత్తూరు నగర పాలక సంస్థ మేయర్ ఆముద, అడిషనల్ ఎస్పీ రామకృష్ణ రాజు, ఇతర ఉన్నతాధికారులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
స్వామివారికి పట్టు వస్త్రాలుస మర్పించేందుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులకు, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులకు వేద పండితులు ఆధ్యాత్మిక వాతావరణంలో వారికి సాంప్రదాయబద్ధంగా పూర్ణ కుంభ స్వాగతం పలికారు.
స్వామి వారి దర్శనానంతరం కల్యాణ వేదికలో జరిగిన వినాయక స్వామి వారి వ్రత కల్పం లో భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్రప టాలను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ , ఆలయ ఈ ఓ పెంచల కిషోర్ అందజేశారు.
Also Read : Wickremesinghe Granted Bill Sensational : విక్రమసింఘేకు బెయిల్ మంజూరు
