Shyamala : అమరావతి – వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ఎమ్మెల్యే భాను ప్రకాశ్ పై మండిపడ్డారు. సినిమా వాళ్లంటే ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. సీనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి వచ్చిన వాళ్లే కదా అని అన్నారు. ఆర్కే రోజాపై ఎమ్మెల్యే భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని అన్నారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలంటే ఏ మాత్రం టీడీపీ, జనసేన కూటమి నేతలకు గౌరవం లేకుండా పోయిందన్నారు. ఇలాగేనా వ్యవహరించేది అంటూ ప్రశ్నించారు.
YCP Leader Shyamala Slams
ఇప్పటికే మహిళల పట్ల చులకన చేసి కామెంట్స్ చేస్తే చట్ట పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్తానం సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల (Shyamala). రూ. 2 వేలు ఇస్తే ఏమైనా చేస్తుందంటూ ఎమ్మెల్యే భాను ప్రకాశ్ మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై నోరు పారేసుకున్నారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఇదే సమయంలో మహిళలు పెద్ద ఎత్తున తనపై భగ్గుమంటున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బేషరతుగా తమ నాయకురాలికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదంటూ మండిపడుతున్నారు. దీనిపై నో కామెంట్స్ అంటూ పేర్కొన్నారు ఎమ్మెల్యే భాను ప్రకాశ్.
Also Read : Hero Raviteja Movie : భారీ ధరకు మాస్ మహరాజా మూవీ ఓటీటీ డీల్
















