Hero Prabhas Marriage – Shyamala Devi : శివుడు ద‌య త‌లిస్తే త్వ‌ర‌లో ప్ర‌భాస్ కు పెళ్లి

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన పెద్ద‌మ్మ శ్యామ‌ల దేవి

Hello Telugu - Hero Prabhas Marriage - Shyamala Devi

Hello Telugu - Hero Prabhas Marriage - Shyamala Devi

Shyamala Devi : న‌టుడు ప్ర‌భాస్ పెళ్లి పీట‌లు ఎక్క బోతున్నాడా. అవున‌నే అంటోంది దివంగ‌త కృష్ణంరాజు భార్య , ప్ర‌భాస్ పెద్ద‌మ్మ శ్యామ‌లా దేవి (Shyamala Devi). ముందు నుంచి డార్లింగ్ కు అన్నీ ఆమెనే. త‌నంటే ప్ర‌భాస్ కు ఇష్టం, అంత‌కు మించిన గౌర‌వం కూడా. ఏది చేసినా ఆమె లేకుండా ఏ ప‌ని చేయ‌డు. గ‌త కొన్నేళ్లుగా ప్ర‌భాస్ పెళ్లి గురింఇ పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఎవ‌రు ఆ అదృష్ట‌వంతురాలు అనేది స‌స్పెన్స్ గా మారింది. ఇప్ప‌టికే త‌ను న‌టి అనుష్క శెట్టితో ల‌వ్ లో ఉన్న‌ట్లు ఆ మ‌ధ్య‌న తెగ ప్ర‌చారం జ‌రిగింది. కానీ దానిని ప‌క్క‌న పెట్టేశాడు ప్ర‌భాస్. అదంతా బ‌క్వాస్ అంటూ కొట్టి పారేశాడు.

Shyamala Devi Key Comments on Prabhas Marriage

ఇదిలా ఉండ‌గా తాజాగా ప్ర‌భాస్ పెద్ద‌మ్మ శ్యామ‌లా దేవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌ను ఓ ఆల‌యాన్ని సంద‌ర్శించిన సంద‌ర్బంగా ప్ర‌భాస్ పెళ్లి గురించి త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టింది. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ కు పెళ్లి కావ‌డం ఖాయ‌మ‌ని చెప్పింది. అయితే త‌న పెళ్లి కావాలంటే ఆ శివుడి ద‌య ఉండాల‌ని పేర్కొంది శ్యామ‌లా దేవి. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ప్ర‌భాస్ అత్య‌ధిక పారితోషకం తీసుకునే న‌టుడిగా గుర్తింపు పొందాడు. ప్ర‌స్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త‌ను న‌టిస్తున్న రాజా సాబ్ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వరుసగా పాన్-ఇండియన్ ప్రాజెక్టుల బిజీ షెడ్యూల్ కారణంగా, ప్రభాస్ పెళ్లి చేసుకునేందుకు అడ్డంకిగా మారింది. త‌నకు స‌రిపోయే జోడీ గురించి ఇంకా దొర‌క‌లేద‌ని, మంచి అమ్మాయి గ‌నుక వ‌స్తే చేసుకునేందుకు సిద్దం అంటూ తెలిపాడు.

Also Read : CM Chandrababu Strong Focus : మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై ఫోక‌స్

Exit mobile version