Shubman Gill : కోల్ కతా : బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ , భారత జట్టు మాజీ స్కిప్పర్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత జట్టు బలంగా ఉందన్నాడు. అన్ని రంగాలలో రాణిస్తోందని పేర్కొన్నాడు. ఇదే సమయంలో అత్యంత చిన్న వయసులోనే ముంబైకి చెందిన శుభ్ మన్ గిల్ (Shubman Gill) బ్యాటర్ గా, కెప్టెన్ గా బాగానే రాణిస్తున్నాడని ప్రశంసలు కురిపించాడు ప్రస్తుత స్కిప్పర్ శుభ్ మన్ గిల్ పై. బుధవారం కోల్ కతాలో సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడాడు. తను అద్భుతమైన ప్లేయర్, అంతకు మించిన బ్యాటర్. కెప్టెన్ గా సరిగ్గా సరి పోతాడని, బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాడు.
Shubman Gill Game Update
ఇదిలా ఉండగా ఓపెనర్ గా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను తీసుకోక పోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో కావాలనే పక్కన పెడుతున్నారని, గిల్ ఆడక పోయినా ఎందుకని కంటిన్యూ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఈ తరుణంలో శుభ్ మన్ గిల్ గురించి గంగూలీ తాజాగా చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అతను చిన్నతనంలో ఇంగ్లాండ్‌లో భారతదేశానికి అద్భుతంగా నాయకత్వం వహించాడని ప్రశంసించాడు గంగూలీ. ఇంగ్లాండ్‌కు వెళ్లి ఇంగ్లాండ్‌లో కెప్టెన్‌గా ఉండటం అంత సులభం కాదన్నాడు. భవిష్యత్తులో తనే భారత జట్టుకు నాయకుడిగా ఉంటాడని, కొనసాగుతాడని తాను భావిస్తున్నట్లు చెప్పాడు.
Also Read : Ex Minister Ramachandra Reddy Shocking Comments : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒప్పుకోం


















