శ్రేయాస్ అయ్య‌ర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ సూప‌ర్

ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన పంజాబ్

hellotelugu-ShreyasIyer

న్యూఢిల్లీ : ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ హ‌వా కొన‌సాగుతోంది. ప‌టిష్ట‌వంత‌మైన నాయ‌క‌త్వ ప‌టిమ క‌లిగిన శ్రేయ‌స్ అయ్య‌ర్ మ‌రోసారి త‌ను ఏమిటో చూపించాడు. ఎలా జ‌ట్టును ముందుండి గెలిపించాలో ఆచ‌ర‌ణ‌లో చేశాడు. త‌మ ముందున్న ల‌క్ష్యం భారీ స్కోర్ అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డా తొట్రుపాటుకు గురి కాలేదు పంజాబ్ . ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో ఏకంగా 264 ప‌రుగులు చేసింది. పంజాబ్ బౌలర్ల‌ను కేఎల్ రాహుల్ ఊచ‌కోత కోశాడు. త‌ను కేవ‌లం 67 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 157 ర‌న్స్ చేశాడు. దీంతో పంజాబ్ ముందున్న లక్ష్యం భారీగా కావ‌డంతో అంద‌రూ గెలుస్తుందో లేదోన‌ని ఆందోళ‌న ప‌డ్డారు.

కానీ ఈ ఐపీఎల్ 19వ సీజ‌న్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తోంది. దీంతో 265 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన పంజాబ్ ఆది నుంచే దంచి కొట్ట‌డం మొద‌లు పెట్టింది. ఢిల్లీ బౌల‌ర్ల‌కు వ‌ణుకు పుట్టించింది. ప్ర‌ధానంగా యంగ్ క్రికెట‌ర్ కీల‌క‌మైన పాత్ర పోషించాడు ఓపెన‌ర్ ప్ర‌భ్ సిమ్ర‌న్ సింగ్. కేవ‌లం 26 బంతులు ఎదుర్కొని 76 ర‌న్స్ చేశాడు. ఇందులో 9 ఫోర్లు 5 సిక్స‌ర్లు ఉన్నాయి. కెప్టెన్ అయ్య‌ర్ త‌గ్గరుండి గెలిపించాడు. కేవ‌లం 36 బ‌తులు ఎదుర్కొని 71 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 3 పోర్లు 7 సిక్సులు ఉన్నాయి. త‌ర్వాత ప్రియాంశ్ ఆర్య 17 బంతులలో 2 ఫోర్లు 5 సిక్సుల‌తో 43 ప‌రుగులు చేశాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశారు. అద్బుత విజ‌యాన్ని న‌మోదు చేశారు.

Exit mobile version