ముంబై : బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇందులో భాగంగా సోమవారం అధికారికంగా తను ముంబై తరపున ఆడనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రస్తుతం దేశీవాళి టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కోసం మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. మిగిలిన మ్యాచ్ లకు ఆడేందుకు గాను ముంబై జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కు కీలకమైన బాధ్యతను అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. తనకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా గత ఏడాది అక్టోబర్‌లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ప్లీహానికి గాయం కావడంతో అంతర్గత రక్తస్రావం జరిగింది. తను ఆనాటి నుంచి మొన్నటి వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం తను ఫిట్ నెస్ ఉన్నట్లు నిరూపించుకున్నాడు.
దీంతో స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగే వన్డే సీరీస్ లో పాల్గొనే భారత జట్టుకు ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ శ్రేయాస్ అయ్యర్ ను. కాగా ముంబైకి రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న శార్దూల్ ఠాకూర్ గాయం కారణంగా టోర్నమెంట్ నుండి వైదొలగడంతో, విజయ్ హజారే ట్రోఫీ మిగిలిన మ్యాచ్‌లకు ముంబై కెప్టెన్‌గా భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌ను సోమవారం నియమించారు. శార్దూల్‌కు గాయమైంది , విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. మా వద్ద శివమ్ దూబే, సూర్యకుమార్ యాదవ్ వంటి ఇతర ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. మిగిలిన మ్యాచ్‌లకు శ్రేయాస్ అయ్యర్‌ను ముంబై కెప్టెన్‌గా నియమించినట్లు తెలిపారు ముంబై చీఫ్ సెలెక్టర్ సంజయ్ పాటిల్.



















