Popular Cricketer Shreyas Iyer Captain : ఇండియా – ఎ జ‌ట్టుకు కెప్టెన్ గా అయ్య‌ర్

ప్ర‌క‌టించిన బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ

Hello Telugu - Popular Cricketer Shreyas Iyer

Hello Telugu - Popular Cricketer Shreyas Iyer

Shreyas Iyer : ముంబై : భార‌త క్రికెట‌ర్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు శ‌నివారం బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ కీల‌క అప్ డేట్ ఇచ్చారు. ఈ మేర‌కు ఆస్ట్రేలియాతో జ‌రిగే సీరిస్ కు శ్రేయ‌స్ అయ్య‌ర్ ను కెప్టెన్ గా నియ‌మించిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ మ్యాచ్‌లలో ఇండియా – ఎ జట్టుకు నాయకత్వం వహించనున్నారు. ధ్రువ్ జురెల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. లక్నోలో జరిగే రెండు అనధికారిక నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాతో తలపడనున్న ఇండియా ఎ జట్టుకు శ్రేయాస్ అయ్య‌ర్ (Shreyas Iyer) కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు తెలిపారు.

Shreyas Iyer As a A Team Captain

మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 16-19 వరకు కొన‌సాగుతుండ‌గా , రెండవ మ్యాచ్ సెప్టెంబర్ 23-26 వరకు ఎకానా స్టేడియంలో జరుగుతుంది. మంగళవారం నుండి ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం అయ్యర్ భారత జట్టులో ఎంపిక చేయ‌లేదు. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. బెంగళూరులో సెంట్రల్ జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ సెమీఫైనల్‌లో ఆడుతున్న వెస్ట్ జోన్ జట్టులో ఈ అద్భుతమైన బ్యాటర్ ఒకడిగా ఉన్నాడు. ఉత్కంఠ భరితమైన ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ తో పాటు ఇంగ్లండ్ తో జ‌రిగిన చివ‌రి టెస్టులో కీల‌క‌మైన పాత్ర పోషించాడు ధ్రువ్ జురైల్.

జ‌ట్టును కూడా డిక్లేర్ చేసింది బీసీసీఐ . శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీసన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్ , వైస్ కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, హర్ష్ దుబే, ఆయుష్ బడోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యష్ ఠాకూర్ ఉన్నారు.

Also Read : Vinayaka Immersion Interesting : ప్ర‌శాంతంగా వినాయ‌క‌ నిమ‌జ్జ‌నం : డీజీపీ

Exit mobile version