Shivdhar Reddy : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) గా బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు సీనియర్ ఐపీఎస్ శివధర్ రెడ్డి (Shivdhar Reddy). ఇదిలా ఉండగా ఇప్పటి వరకు డీజీపీగా బాధ్యతలు చేపట్టిన జితేందర్ నిన్న పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో శివ ధర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేకంగా ఏరికోరి నియమించింది. ఈ సర్కార్ వచ్చాక అత్యధికంగా నామినేటెడ్, కీలక పోస్టులన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే కట్టబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయినా వాటన్నింటిని బేఖాతర్ చేస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక శివధర్ రెడ్డి 1994వ బ్యాచ్ అధికారి. ఇప్పటి వరకు ఆయన తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ గా పని చేస్తున్నారు.
IPS Shivdhar Reddy As a Telangana New DGP
తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు పోలీస్ దళ అధిపతిగా పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది ప్రభుత్వం. ఇదిలా ఉండగా శివధర్ రెడ్డి మూడు దశాబ్దాలకు పైగా విధులు నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో అనేక కీలక పదవులు చేపట్టారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రెడ్డి ఇన్‌స్పెక్టర్ జనరల్ హోదాలో ఇంటెలిజెన్స్ విభాగానికి మొదటి చీఫ్ అయ్యారు. అదనపు డీజీపీ హోదాకు పదోన్నతి పొందిన తర్వాత పర్సనల్ వింగ్, రైల్వేస్, రోడ్ సేఫ్టీ వంటి కీలక శాఖలలో ప్రధాన పోస్టులలో పనిచేశారు. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రెడ్డి అదనపు డీజీపీ హోదాలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తిరిగి నియమితులయ్యారు.
Also Read : CM Chandrababu Important Update : తీర ప్రాంతం ఏపీకి ఉన్న ప్రధాన బలం

















