ముంబై : అందాల ముద్దుగుమ్మ, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన తల్లి మరణం తర్వాత బాధలో ఉన్న సమయంలో తనకు శిఖర్ పహారియా అండగా నిలిచాడని తెలిపింది. తన జీవితంలో అత్యంత కష్టతరమైన సమయాల్లో ఒకటైన ఆ సమయంలో లండన్‌లో తన చదువును పక్కనపెట్టి మరీ తన దగ్గరకు వచ్చిన శిఖర్ గురించి జాన్వీ గుర్తు చేసుకున్నారు. శిఖర్‌తో తనకున్న అనుబంధం గురించి బయట పెట్టింది. వారిద్దరి మధ్య సంబంధం బహిరంగంగా చర్చనీయాంశం కాకముందే వారి మధ్య ఎంతటి బలమైన బంధం ఉండేదో ఆమె వెల్లడించారు. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి అకస్మాత్తుగా మరణించినప్పుడు, ఆ కష్టకాలంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తెలుసుకున్న శిఖర్ ఆ వెంటనే ముంబైకి తిరిగి వచ్చారని జాన్వీ చెప్పారు.
ఆ సమయంలో తనకు తోడుగా ఉండటం కోసం శిఖర్ లండన్‌లో తన చదువుకు విరామం ఇచ్చారని తెలిపారు. అంతేకాదు తనకు ఎప్పుడు అవసరమైనా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో, జుహులోని ఒక స్నేహితుడి ఇంట్లో నెల రోజుల పాటు బస చేశారని తెలిపింది. ఆ అత్యంత బాధాకరమైన సమయంలో, మరే ఇతర విషయాల కంటే తన పక్కన ఉండటానికే శిఖర్ ప్రాధాన్యత ఇవ్వడంతో తనకు అతని పట్ల మరింత ఆసక్తిని రేపేలా, ప్రేమ కలిగిలే చేసిందని చెప్పింది జాన్వీ కపూర్. ఇదిలా ఉండగా జాన్వీ , శిఖర్‌లు గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నటిగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించినప్పటికీ, వీరిద్దరూ తరచుగా బహిరంగ కార్యక్రమాల్లో, కుటుంబ వేడుకల్లో కలిసి కనిపిస్తుంటారు. మహారాష్ట్రకు చెందిన ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన శిఖర్, పలు సందర్భాల్లో జాన్వీతో కలిసి కనిపించారు.

















