హైదరాబాద్ : శర్వానంద్ కీ రోల్ పోషించిన చిత్రం భోగి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మూవీ మేకర్స్ టీజర్ ను వదిలారు. ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం 24 గంటల్లోనే ఏకంగా 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. సినీ వర్గాలను ఆశ్చర్య పోయేలా చేసింది. ఈ సినిమా గ్రామీణ నేపథ్యం కలిగిన యాక్షన్ డ్రామా నేపథ్యంతో చిత్రీకరించారు. శర్వానంద్ ఈ ఏడాది తన మూడవ చిత్రం ‘భోగి’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా టైటిల్ సంక్రాంతి పండుగకు సంబంధించినది అయినప్పటికీ, ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా; ఇందులో తన ప్రజల కోసం శర్వానంద్ చేసే పోరాటం ప్రధానాంశంగా ఉంటుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేయడం ద్వారా ప్రచారాన్ని ప్రారంభించింది. నెటిజన్లకు విందు ఇచ్చింది.
భోగి టీజర్ ప్రపంచం తెరలను వేడెక్కించింది. టీజర్‌కు భారీ స్పందన లభించింది . 10 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ , యూట్యూబ్‌లో 2 స్థానంతో ట్రెండింగ్ లో ఉంది. ‘భోగి’ టీజర్ భారీ అంచనాలను రేకెత్తించింది. నవంబర్ 12న థియేటర్లలో ప్రదర్శనకు రెడీ అవుతోంది .టీజర్ విషయానికొస్తే ఇది ‘బొగ్గులగుట్ట’ గ్రామం. అక్కడి ప్రజల పరిచయంతో మొదలవుతుంది. ఇది ఒక చిన్న గ్రామం అయినప్పటికీ స్థానిక భాషలో గ్రామ పెద్దలుగా పిలువబడే ‘పాలెగాళ్లు’ దీనిని పాలిస్తుంటారు. కుల వ్యవస్థ ఆధారంగా పాలెగాళ్లు గ్రామస్తులను పూర్తిగా అణచి వేస్తుండగా శర్వానంద్ (అలియాస్ గంగ) తన ప్రజల కోసం వారిపై గళమెత్తడానికి ప్రయత్నిస్తాడు. వారి గ్రామంలో ఏటా నిర్వహించే ‘మహాదేవ ప్రథ’కు సంబంధించిన సన్నివేశం కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.
కందుల సులోచన రాణి’గా కనిపిస్తున్న అనుపమ పరమేశ్వరన్, ‘కమ్మరోళ్ల గంగ’ పాత్రలో ఉన్న శర్వానంద్‌ను పాలెగాళ్లు బంధించినప్పుడు గట్టిగా నిలదీసే సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఆమె గ్రామీణ నేపథ్యానికి తగ్గట్టుగా మార్చుకున్న రూపం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పాలెగాళ్లు తమ అధికారాన్ని ఉపయోగించి గ్రామస్తుల జీవితాలను ఎలా దోచుకున్నారో చూపే ఈ కల్పిత కథ, ప్రేక్షకులను 1960ల నాటి కాలానికి తీసుకు వెళుతుంది. భీమ్స్ అందించిన నేపథ్య సంగీతం ఈ టీజర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది.
