బాలీవుడ్ బాద్ షాగా ప్రేమగా పిలుచుకునే షారుక్ ఖాన్ పుట్టిన రోజు ఇవాళ. ఆయన నవంబర్ 2, 1965లో ఢిల్లీలో పుట్టారు. తన అమ్మమ్మ ఉండే మంగళూరులో కొంత కాలం పెరిగారు. షారుక్ ఖాన్ తాత ఇఫ్తికర్ అహ్మద్ చీఫ్ ఇంజనీర్ గా పని చేస్తుండడంతో అక్కడ ఉన్నారు.
ఆఫ్గనిస్తాన్ కు చెందిన సంప్రదాయ పఠాన్ కుటుంబానికి చెందిన వారమని ఒకానొక సమయంలో తెలిపారు బాద్ షా. ఆయన తండ్రి తాజ్ మొహమద్ ఖాన్ ప్రముఖ స్వాత్రంత్ర సమర యోధుడు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కు అనుచరుడిగా ఉన్నారు. భారత్ విడి పోయిన తర్వాత బాద్ షా కుటుంబం ఢిల్లీకి వచ్చారు.
ఆ తర్వాత అనుకోకుండా సినీ రంగంలోకి వచ్చారు. హీరోగా నిలదొక్కు కునేందుకు నానా కష్టాలు పడ్డారు. కష్టపడి ఎవరి సిఫారసులు లేకుండానే తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించాడు.
ఇవాళ భారతీయ సినీ జగత్తులో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది బాద్ షాకు. ఇన్నేళ్లవుతున్నా ఇంకా సినిమాను ప్రాణం కంటే మిన్నగా భావిస్తాడు. ఈ ఏడాది రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇవాళ తన పుట్టిన రోజు సందర్బంగా రాజు హిర్వానీ తీసిన డుంకీ మూవీకి సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్.
షారుక్ ఖాన్ పుట్టిన రోజు సందర్బంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.