Senior IAS Sanjay Jaju : ఢిల్లీ – తెలంగాణ ప్రభుత్వం పిలిస్తే ప్రధాన కార్యదర్శిగా వచ్చేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ జాజు (Senior IAS Sanjay Jaju). తను ఫిబ్రవరి 8, 1961లో పుట్టారు. 1984వ బ్యాచ్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. అంతకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు.. అంతే కాకుండా మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. కాగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా అవకాశం ఇస్తే వచ్చే మూడున్నరేళ్ల పాటు సర్వీస్ చేయడానికి సిద్ధమని తాజాగా తన మనసులోని మాట బయట పెట్టారు. కేంద్రంలో తాను ఉన్నది చీఫ్ సెక్రటరీ క్యాడర్ తో సమానమని స్పష్టం చేశారు సంజయ్ జాజు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. ఎస్. రామకృష్ణా రావు ఆగస్టు 31వరకు మాత్రమే ఉంది.
Senior IAS Sanjay Jaju Interesting Comments
దీంతో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. తన సర్వీస్ పొడిగించేందుకు సీఎం మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో సంజయ్ జాజు చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి అధికార వర్గాలలో. ఇదిలా ఉండగా 1991 బ్యాచ్ లో కె. రామకృష్ణరావుతో పాటు అర్వింద్ కుమార్ కూడా ఉన్నారు. మరో వైపు అర్వింద్ కుమార్ వచ్చే ఏడాది 2026 అక్టోబర్ లో రిటైర్మెంట్ కానున్నారు. 1992 ఐఏఎస్ బ్యాచ్ లో జయేష్ రంజన్ , సంజయ్ జాజు, వికాస్ రాజు సీఎస్ రేసులో ఉన్నారు. కాగా జయేష్ రంజన్ 2027 సెప్టెంబర్ లో పదవీ విరమణ చేస్తారు. గతంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన వికాస్ రాజ్ 2028 మార్చిలో తప్పుకుంటారు.
Also Read : Daggubati Prasad Shocking Comments : జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే బూతు పురాణం
















