Sekhar Kammula : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న దర్శకులలో ఒకరుగా గుర్తింపు పొందారు శేఖర్ కమ్ముల (Sekhar Kammula). తన స్టోరీస్ భిన్నంగా ఉంటాయి. మనసుకు హత్తుకునేలా తీయడంలో తనకు తనే సాటి. ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడడు. తన పనేదో తను చేసుకుంటూ వెళ్లి పోతాడు. డాలర్ డ్రీమ్స్ , కాలేజ్ డేస్, గోదావరి, ఫిదా, లవ్ స్టోరీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మూవీకి భిన్నమైన కథ ఉండేలా జాగ్రత్త పడ్డాడు. తాజాగా తను మొదటిసారిగా స్టార్ హీరోలు, హీరోయిన్ తో కలిసి మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
Sekhar Kammula Focus on Samantha
అదే కుబేర చిత్రం. ఇందులో కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ అందగాడు అక్కినేని నాగార్జునతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించారు. ప్రత్యేకించి ధనుష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తను భిక్షగాడి పాత్రలో సూపర్ గా నటించాడు. గతంలో విజయ్ ఆంటోనీ భిక్షగాడు సినిమా ద్వారా పాపులర్ అయ్యాడు.కానీ కుబేరలో పేదోడు, ధనవంతుడి మధ్య జరిగే ఆసక్తికరమైన పాయింట్ ను ఆధారంగా తీసుకుని కుబేర తెరకెక్కించాడు. భారీ ఎత్తున స్పందన వచ్చింది. మంచి కలెక్షన్స్ కూడా దక్కాయి.
సినిమా సక్సెస్ కావడంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల చిట్ చాట్ చేశాడు. ఈ సందర్బంగా నేషనల్ హీరోయిన్ సమంత రుత్ ప్రభుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను తీయబోయే తదుపరి చిత్రం ప్రధానంగా మహిళా ఓరియంటెడ్ చిత్రంగా ఉంటుందన్నాడు. ఇందు కోసం ఆ పాత్రకు సరిగ్గా తను సరిపోతుందని పేర్కొన్నాడు. ఈ కేరెక్టర్ అద్భుతంగా ఉండడం ఖాయమని జోష్యం చెబుతున్నాడు శేఖర్ కమ్ముల. దీంతో ఫుల్ ఖుష్ అవుతోంది సామ్. తను ఓ వైపు నటిస్తూనే ఇంకో వైపు నిర్మాతగా మారింది. ఇటీవలే తెలుగులో శుభమ్ మూవీ తీసింది. ఇది బిగ్ సక్సెస్ అయ్యింది.
Also Read : Poonam Kaur Shocking Comments : పవన్..త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ ఫైర్



















